ఎత్తైన ఆ తెల్లని గోడ వెనుక ఎప్పుడూ ఒక ఉద్యానవనం ఉంటుంది… అక్కడ దగ్గరగా కోయబడిన పాలిపోయిన పచ్చిక, దానిమీద అలంకరించబడిన పువ్వులు ఉన్నాయి. అతిథిని సంతోషపెట్టడానికి ఒక కుర్చీ వేసి ఉంచారు. ఎత్తైన రొమ్ములుగల సన్నటి నడుముగల స్త్రీలు నెమలికంఠం రంగు నీలపు పాత్రల్లో అతనికి పళ్ళూ, ఆహారమూ అందిస్తున్నారు.
ఆ గోపురాలున్న భవన ద్వారానికి దూరంగా ఏనుగులసవారీపై సార్థవాహులు పోతున్నారు, బంగారం రంగు పువ్వులు నగిషీ చెక్కినట్టున్న అడవి మార్గంగుండా నీలాకాశం నేపథ్యంలో తెల్లగా, విల్లులా వంచిన గృహద్వారాలుగల నగరాలకి ఆశ్వికులు పరుగుతీస్తున్నారు.
దుమ్ముపట్టి వివర్ణమైన ఈ పత్రాలు సరికొత్త బంగారు లోకాలకీ సముద్రాలలోని అందంగా విరిసే ద్వీపాలకూ త్రోవచూపించే కవాటాలు. ఇక్కడి కెరటాలూ వాటి లయలూ, విషాద పాత్రలూ, మేధస్సుకు సవాళ్లు విసురుతాయి. ప్రకాశవంతమైన పుటమీద సగం అర్థమయి, సగం ఊహించిన కల్పనలకంటే బలీయమైనవి అవి.
నగరానికి ఆవల బాటసారి నాలుక పిడచకట్టుకుపోతున్న తన దాహం తీరడానికి నేలలోదాగిన నీటిబుగ్గ ఉబకాలని ప్రార్థించినట్టు నాకుకూడా, మౌనంగా ఉన్న ఈ పుస్తకాలలో ఎక్కడో పిడచగట్టుకుపోతున్న నాలుక ఆర్తి కనిపిస్తోంది. నా ఒడిలో అందం వెల్లి విరుస్తోంది . ఇడా ఒనీల్