అది కేవలం ఉరుముతున్న అకాశం మీద
గన్ మెటలు మేఘాలను
వెంట తరిమే గాలిపరగడాయే కాదు;
కొమ్ము ఊదినపుడు వెలువడ్డ శబ్దతరంగం
పైకి ఎగసినట్టు అంతటి వడిగాలిలో
మనంకూడా తేలిపోతున్న అనుభూతే కాదు;
అది మా చెల్లెలు నీటిలోకి దూకడం,
ఆమె అరుపులూ, ఒక్కసారి రక్తం,
ఎముకలూ క్రిందకి ప్రవహిస్తున్న అనుభవమే కాదు;
అందులో అన్నీ కలిసి ఉన్నాయి.
బురదా, కరుగుతున్న మంచులోంచి
కొత్తగా మొలకెత్తుతున్న గరికా,
క్రిందటివారం కురిసిన మంచుతుఫానుకి
మా ఇంటి ద్వారం ముందు వాలిపొయిన లిలాక్
తిరిగి కొత్తగా మొగ్గతొడగడమూ.
ఇప్పుడు ఆ బాలెంత, ప్రాణాలు కడగట్టుకుపోయి,
తన బిడ్డను సాకడానికి ప్రయత్నిస్తోంది,
సుదీర్ఘమైన వీడ్కోలుకు సంసిద్ధమవుతూ…
.
కేథ్లీన్ నోరిస్
Born 27 July 1947
అమెరికను కవయిత్రి
.

https://www.homileticsonline.com/subscriber/interviews/norris.asp
స్పందించండి