ఇసుకమీద… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి స్నేహం పునాదిగా లేని ప్రతి ప్రేమా ఇసకమీద కట్టిన భవంతిలాంటిది. దాని గోడలు దేశంలో దేనికీ తీసిపోనంత గట్టివైనా వాటి శిఖరాలు ఆకాశంలోకి నిటారుగా హుందాగా తలెత్తినా; అనుభవజ్ఞులూ, నిపుణులైన పనివారు అన్నిచోట్లా అందమైన అలంకరణలతో తీర్చిదిద్దినా చీకటి మూలల్లో తళతళలాడే విగ్రహాలు నిలబడినా, పూలుదాగున్న చోటుల్లో జలయంత్రాలు నీరు చిమ్ముతున్నా, తూర్పునుండి ఆగ్రహోదగ్రమైన ఒక్క పెనుగాలి వీచితే చాలు, విధి వక్రించి, పగలనక రాత్రనక ఒక తుఫాను ముంచుకొస్తే చాలు, దాని గోడలు దాసోహం అంటాయి. పాపం! అంత అందమైన హర్మ్యమూ నేలమట్టం అయిపోతుంది. ప్రేమ జీవితంలోని విషాదాన్నీ, ఆధిభౌతికమైన విపత్తుల్నీ తట్టుకు నిలబడాలంటే, స్నేహమనే దృఢమైన పునాది అవసరం. . ఎలా వీలర్ విల్ కాక్స్ November 5, 1850 – October 30, 1919 అమెరికను కవయిత్రి . Upon The Sand. . All love that has not friendship for its base, Is like a mansion built upon the sand. Though brave its walls as any in the land, And its tall turrets lift their heads in grace ; Though skilful and accomplished artists trace Most beautiful designs on every hand, And gleaming statues in dim niches stand, And fountains play in some flow’r-hidden place : Yet, when from the frowning east a sudden gust Of adverse fate is blown, or sad rains fall Day in, day out, against its yielding wall, Lo ! the fair structure crumbles to the dust. Love, to endure life’s sorrow and earth’s woe, Needs friendship’s solid masonwork below. . Ella Wheeler Wilcox November 5, 1850 – October 30, 1919 American Poems of Passion, P24 Belford –Clarke Co. Chicago, 1890 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఏప్రిల్ 11, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#1891AmericanElla Wheeler Wilcox మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవిస్వర్గారోహణ … కేథ్లీన్ నోరిస్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.