మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి

మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు
ఏ పనిచెయ్యడానికైనా సమయం కేటాయించడానికి.
అతనికి చాలినన్ని ఋతువులు లేవు
తన ప్రతి అవసరానికీ ఒక ఋతువు కేటాయించడానికి.
ఆ విషయంలో మతగ్రంథం చెబుతున్నది తప్పు.

అతనికి ఒకే సమయంలో ప్రేమా కావాలి, ద్వేషమూ కావాలి
ఆ కళ్ళతోనే ఒక ప్రక్క నవ్వాలి, మరొక వంక ఏడ్వాలి,
ఆ చేతులతోనే రాళ్ళు రువ్వాలి, రాళ్లు ఏరుకోవాలి,
యుద్ధంలో ప్రేమించాలి, ప్రేమలో యుద్ధం చెయ్యాలి.
ద్వేషించాలి, క్షమించాలి, గుర్తుంచుకోవాలి, మరిచిపోవాలి,
ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, గజిబిజి అయిపోవాలి, తినాలి, అరిగించుకోవాలి
ఇవన్నీ చెయ్యడానికి చరిత్రకి
యుగాలూ జగాలూ పడుతుంది.

మనిషికి సమయం చిక్కదు.
అతను పోగొట్టుకున్నాకే పోయింది కావాలనుకుంటాడు, అందితే
మరిచిపోతాడు, అతను మరిచినపుడు ప్రేమిస్తాడు, అతను
ప్రేమిస్తున్నపుడు మరిచిపోవడం ప్రారంభిస్తాడు.

అతని మనసు రాటు దేరింది.
అతని ప్రవృత్తి సమయోచితంగా ప్రవర్తిస్తుంది.
ఎటొచ్చీ, అతని శరీరమే ఎప్పటికీ ఆసక్తితో
ఉంటుంది. అది ప్రయత్నిస్తుంది గురి తప్పుతుంది,
బుద్ధితక్కువగా ప్రవర్తిస్తుంది, ఏదీ నేర్చుకోదు
ఎప్పుడూ దాని సుఖసంతోషాలలో, వేదనలలో
మునిగి గుడ్డిగా, మత్తుగా పడి ఉంటుంది.

మనిషి ఋతువు ముగియగానే రాలిన పండులా రాలిపోతాడు
ముడుతలుదేరి, పక్వానికి వచ్చి, తనగురించిన ఆలోచనలతో నిండి.
పండుటాకులు నేలమీద రాలి అక్కడే వాడి ఎండిపోతుంటాయి
చెట్లన్నీ ఆకులు రాల్చి మోడులై ఒకే ఒక్క చోటును చూపిస్తుంటాయి
అదిగో, అక్కడ అతనికి అన్నిటికీ సమయం చిక్కుతుంది.
.
యెహుదా అమిఖాయ్

ఇజ్రేలీ కవి

Photo By Yair Medina (יאיר מדינה), CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=56629706

 

.

A Man Doesn’t Have Time In His Life

.

A man doesn’t have time in his life

 to have time for everything.

 He doesn’t have seasons enough to have

 a season for every purpose. Ecclesiastes

 Was wrong about that.

 A man needs to love and to hate at the same moment,

 to laugh and cry with the same eyes,

 with the same hands to throw stones and to gather them,

 to make love in war and war in love.

 And to hate and forgive and remember and forget,

 to arrange and confuse, to eat and to digest

 what history

 takes years and years to do.

 A man doesn’t have time.

 When he loses he seeks, when he finds

 he forgets, when he forgets he loves, when he loves

 he begins to forget.

 And his soul is seasoned, his soul

 is very professional.

 Only his body remains forever

 an amateur. It tries and it misses,

 gets muddled, doesn’t learn a thing,

 drunk and blind in its pleasures

 and its pains.

 He will die as figs die in autumn,

 Shriveled and full of himself and sweet,

 the leaves growing dry on the ground,

 the bare branches pointing to the place

 where there’s time for everything.

.

Yehuda Amichai

‎(3 May 1924 – 22 September 2000)

Israeli Poet

 

poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/11/man-doesn-have-time-in-his-life-yehuda.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: