నాకేమిటి లక్ష్యం… సారా టీజ్డేల్

కలలలోనూ, వసంతపు మత్తులోనూ
నా పాటలు వినిపించకపోతే నాకేమిటి లక్ష్యం?
అవి సుగంధాలవంటివి, నేనొక చెకుముకి రాయిని, నిప్పురవ్వని,
ఆర్తిగా పిలిచేవి అవి; వాటికి బదులుపలుకుతాను అంతే!

నా ప్రేమ కొద్దిలో ముగిసిపొతుందంటే, నాకేమిటి లక్ష్యం?
నా హృదయాన్ని చెప్పదలుచుకున్నది చెప్పనీండి, బుద్ధి మారుమాటాడదు.
నా బుద్ధికి మౌనంగా ఉండగల అహం, సమర్థతా ఉన్నై,
పాటలు కట్టేది నా హృదయమే, నేను కాదు.
.
సారా టీజ్డేల్
అమెరికను కవయిత్రి

.

.

.

.

What Do I Care

What do I care, in the dreams and the languor of spring,

  That my songs do not show me at all?

For they are a fragrance, and I am a flint and a fire;

  I am an answer, they are only a call.

What do I care—for love will be over so soon—

  Let my heart have its say, and my mind stand idly by.

For my mind is proud, and strong enough to be silent—

  It is my heart that makes my songs, not I.

Sara Teasdale

Poetry, A Magazine of Verse

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: