నెల: మార్చి 2017
-
జ్వాలలు… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి
ప్రకృతి రగిలించే ఆ చిన్ని చిన్ని జ్వాలలు… నీలి నీలి మొగ్గలూ, ఎర్ర ఎర్రని పూలూ… తుఫాను రాత్రుల్లో ఆమె ఆగ్రహం కొండల్ని కొరడాలతో కొట్టినపుడు, చల్లారుతుంది. మేఘాల ఎత్తుకి ఆమె ఎగదోసే మంటలు రంగురంగుల హరివిల్లూ, తటిల్లతలూ … ఆమె ఆగ్రహంతో నేలను గట్టిగా శపిస్తూ కుమ్మేస్తుంది పర్యవసానం మృత్యువైనా లెక్కచేయదు. ఆమె ఆత్మలో రగిలించే అగ్ని కీలలు కవి ఆవేశంలోనూ, విప్లవకారుడి ఆలోచనలోనూ; రెంటినీ నియంత్రించలేదు; అక్కడ వాడిన ఇంధనం ఇక్కడకాదు, వేరే గనుల్లోంచి…
-
ఓటమి … గ్లెన్ వార్డ్ డ్రెస్ బాక్, అమెరికను కవి
హతుని ముఖం కాల్పులదిశలో ఉంటూ యుద్ధం గుర్చిన అన్ని కోర్కెలూ చిక్కిశూన్యమై మితిలేని మరపులో కప్పబడి; చివరకి మృత్యువు మాత్రమే ఉపశాంతినివ్వగడంలో ఓటమి ఉంది. ఈ శరీరం ఆత్మ సంకల్పాలని గ్రహించలేక దేవులాడుతూ, చిత్రహింసలపాలైన బుద్ధి తిరిగి పొందలేని పూర్వవైభవాన్ని తలుచుకుంటూ మదిరప్రభావానికిలోనైనట్టు స్మృతితప్పడంలో ఓటమి ఉంది. కానీ, విజయానికి ప్రేరణనిచ్చి, దాన్ని సాధ్యం చేసిన కలల్ని పక్కనబెట్టి, చిత్రంగా, సాధించిన విజయానికి సంతృప్తి చెంది, గెలుపు ప్రయోజనం క్రమంగా బలహీనపడుతూ, చివరకి ఏ ప్రయోజనం ఇవ్వకపోగా, ఇవ్వలేని…
-
నీడపట్టున నివసించేవాళ్ళు … హోవర్డ్ ముంఫోర్డ్ జోన్స్ , అమెరికను కవి
నీడపట్టున నివసించేవాళ్ళు చూపుమేర వ్యాపించిన నీడల మైదానాలలో భ్రాంతికలిగించే తెలినురుగు తీరాలవెంట ప్రేతాత్మల్లా నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. వాళ్ళజీవితాలలో ఏ కోశానా ఆశ కనిపించదు ఐనప్పటికీ వాళ్ళు మరణించలేరు, బావురుమనే వాళ్ళ సముద్ర తీరాల్ని వదలలేరు అసంతృప్తికరమైనా, వాళ్ళ ఊహల్ని వదులుకోలేరు. నీడపట్టున నివసించేవాళ్ళు ఎండుటాకుల కదలికల్లా మాటాడుతుంటారు. పచ్చనిమైదానాలతో మాటాడేటపుడు ఎవరికీ సంతోషమూ ఉండదు, విచారం ప్రకటించరు. వాళ్ళు అలా గుసగుసలాడుతూనే ఉంటారు అంతే బహుశా బిక్కుబిక్కుమని ఒంటరిగా ఒడ్డుకుచేరే కెరటాలకీ అక్కడ నివసించే మనిషికి…
-
ఏం చేద్దాం మనం ?… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
ఇప్పుడిక, ఎప్పటికన్నాకూడా, మనజీవితాలు విడిపోకతప్పదు నా దారి అటు వెళుతోంది, నీదారి ఇంకోవైపుకు పోతోంది. ఓ మనసా! మనం ఈ ప్రాణప్రదమైన ప్రేమని ఏం చేద్దాం? అది రోజు రోజుకీ భరించలేని భారమౌతోంది. దాచెద్దామా? ఈ భూమిమీద అన్ని మాళిగలలో, శూన్యమూ, రోదసిలో ప్రియా, దాన్ని దాచడానికి సరిపడినంత జాగా దొరకదే ; గతమంతటి ఘనమైన అంతులేని గిడ్డంగి కూడా మనకళ్ళకి కనిపించకుండా దాన్ని దాచలేదని నా భయం. పోనీ దేన్లోనో ముంచెద్దామా? అన్ని సముద్రాలలోని నీళ్ళనూ…
-
నీకు పెనుగాలంటే భయమా?… హామ్లిన్ గార్లాండ్, అమెరికను
నీకు పెనుగాలి హోరంటే భయమా? వర్షం కత్తిలాకోస్తుంటే భయమా? ఫో! వాటిని ఎదుర్కో. వాటితో పోరాడు! మళ్ళీ ఆటవికుడివయిపో! తోడేల్లా ఆకలితో అలమటించి చలిలో వడకట్టిపో! వెళ్ళు, వెళ్ళు, కొంగలా బురదలో నడూ. నీ అరచేతులు బండబారుతాయి, నీ బుగ్గలు ఎండకి నలుపెక్కుతాయి, నువ్వు చింపిరిజుత్తుతో, అలసి, నల్లనడతావు. అయితేనేం, నువ్వొక మనిషిలా తిరుగుతావు. . హామ్లిన్ గార్లాండ్ (September 14, 1860 – March 4, 1940) అమెరికను . . DO YOU…
-
ఒక చిన్ని పక్షికి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఒక రోజు నువ్వు గూడునుండి రాలిపడడం చూసేను నీ రెక్కకి గాయమై, నువ్వు బెదురుచూపులు చూస్తున్నావు. నీ గాయాన్ని నయం చేసి నెమ్మదిగా నీ భయంపోగొట్టాను అప్పుడు నువ్వు ధైర్యంగా కూస్తూ పాడటం మొదలెట్టావు. నిన్ను పెంచుకుందామని నీకొక పంజరం తెచ్చాను నీకిక్కడ అడవి అంతగా తెలియదు కనుక నువ్వు కొద్దికాలంలోనే ఆ విషయం మరిచిపోయి నాతో కలిసి ఉండటానికి నిశ్చయించుకుంటావని అనుకున్నాను. కానీ వేసవి రాగానే, నీలో ఆశలు మోసులువేశాయి ఎక్కడికో అలా దూరదూరంగా ఎగరడానికి.…