ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది.
రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది
కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు
నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది
రేయి నిద్రపోడానికీ, కలలు కనడనికే అయినా
ఎంత చూసినా, రాత్రి మొత్తంలో ఏ రైలూ ఇటు రాదు;
కానీ నాకు ఆకాశంలో ఎగురుతున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి
దాని ఇంజనులోంచి ఎగజిమ్ముతున్న ఆవిరిచప్పుడు వినిపిస్తోంది.
నే నేర్పరచుకున్న స్నేహాలవల్ల మనసు హాయిగా ఉంది
అంతకంటే మంచి స్నేహితులు దొరుకుతారనుకోను
అయినప్పటికీ, స్నేహితులుదొరుకుతారంటే
నేను ఎక్కని రైలంటూ ఉండదు, అది ఏవూరు వెళ్ళనీ.
.
స్పందించండి