నాలుగురోజులపాటు భూమి
ఇనపగుళ్ళ వర్షానికి పగిలి ముక్కలైంది.
మా చుట్టూ ఉన్న ఇళ్ళు నేలమట్టమయాయి;
మృత్యుసంకేతమైన ఇల్లుకూలిపోయిన శబ్దం
ఎప్పుడు వినబడుతుందోనని చెవులు రిక్కించి
భయంతో,చెమటలు కక్కుకుంటూ
మూడురోజులూ అసలు నిద్రపోడానికి ధైర్యం చాలలేదు.
నాలుగోనాటి రాత్రి ప్రతిఒక్కరూ,
నరాలు పిట్లిపోయి, అలసట అంచులకు చేరి,
నిద్రపోయాం, నిద్రలొ గుంజుకుంటూ, ఏవో గొణుక్కుంటూ
పైన ఫిరంగులు అలా మోతమోగుతున్నా.
ఐదవరోజుకి ఒక్కసారి ప్రశాంతత వచ్చింది;
మేము మా కలుగుల్లోంచి బయటకి వచ్చాం
నేలమీద జరిగిన విధ్వంసాన్ని చూశాము.
నిశ్చలంగా ఉన్న నీలాకాశంమీద
తెల్లని మేఘాలు మౌనంగా బారులుతీరి కవాతుచేస్తున్నాయి.
.
రిచర్డ్ ఆల్దింగ్టన్
8 July 1892 – 27 July 1962
ఇంగ్లీషు కవి .
.
స్పందించండి