ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా. గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది; అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి; “అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా! నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?” అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి. అయినప్పటికీ చివరిసారిగా విసిరేను సముద్రంలోకి చివరికి ఎమవుతుందోనని ఎదురు చూస్తూ. వావ్ ! పరమాద్భుతమైన వెలుగులు! ధవళ కాంతులతో ఆకాశానికి బాలుడు ఎగబ్రాకుతున్నాడు. ఆ ఆనందంలో వేదనామయమైన గతాన్ని మరిచిపోయాను . .