నీరు … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి అన్ని మతాల్లోనూ నీటిప్రాముఖ్యత గురించి కవి ఈ కవితలో పరోక్షంగా చెబుతున్నాడు. . నన్నే గనక ఒక మతాన్ని స్థాపించమని చెబితే నేను నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. చర్చికి వెళ్ళాలంటే పాదాలు తడిసే నీళ్ళలోంచి నడవాలి వేరే రకమైన వస్త్రాలు ఆరబెట్టాలి. నా ప్రార్థనలూ పూజల్లో భక్తితో స్నానం చెయ్యడం నీటిలో నిలువునా తడవడం వంటి దృశ్యాలుంటాయి. నేను ‘తూర్పు’కి ఒక గ్లాసుడు నీళ్ళు ఎత్తితే చాలు దానిమీద ప్రతిఫలించే ఏపాటి కాంతైనా తండోపతండాలుగా ప్రజల్ని సమీకరిస్తుంది. . ఫిలిప్ లార్కిన్ (9 August 1922 – 2 December 1985) ఇంగ్లీషు కవి. . Water If I were called in To construct a religion I should make use of water. Going to church Would entail a fording To dry, different clothes; My litany would employ Images of sousing, A furious devout drench, And I should raise in the east A glass of water Where any-angled light Would congregate endlessly. . Philip Arthur Larkin (9 August 1922 – 2 December 1985) English Poet http://wonderingminstrels.blogspot.in/search/label/Poet%3A%20Philip%20Larkin Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిమార్చి 13, 2017