హతుని ముఖం కాల్పులదిశలో ఉంటూ
యుద్ధం గుర్చిన అన్ని కోర్కెలూ చిక్కిశూన్యమై
మితిలేని మరపులో కప్పబడి; చివరకి మృత్యువు
మాత్రమే ఉపశాంతినివ్వగడంలో ఓటమి ఉంది.
ఈ శరీరం ఆత్మ సంకల్పాలని గ్రహించలేక
దేవులాడుతూ, చిత్రహింసలపాలైన బుద్ధి
తిరిగి పొందలేని పూర్వవైభవాన్ని తలుచుకుంటూ
మదిరప్రభావానికిలోనైనట్టు స్మృతితప్పడంలో ఓటమి ఉంది.
కానీ, విజయానికి ప్రేరణనిచ్చి, దాన్ని సాధ్యం చేసిన కలల్ని
పక్కనబెట్టి, చిత్రంగా, సాధించిన విజయానికి సంతృప్తి చెంది,
గెలుపు ప్రయోజనం క్రమంగా బలహీనపడుతూ,
చివరకి ఏ ప్రయోజనం ఇవ్వకపోగా, ఇవ్వలేని స్థితికి
చేరుకోడంలో ఉన్న ఓటమి, సామాన్య దృష్టికి
అంత సులభంగా గ్రహించడం సాధ్యం కాదు.
.
గ్లెన్ వార్డ్ డ్రెస్ బాక్
(Sept 9, 1889 – Jun 28, 1968)
అమెరికను కవి

.
Defeat
.
There is defeat where death gives anodyne
And all desires of the battle wane
In deep forgetfulness, and the one slain
Lies with his face turned toward the firing-line.
There is defeat where flesh fails the design
Of Spirit, and the groping, tortured brain
Sees glories lost it cannot win again.
And wears itself out like effect of wine.
But no defeat is quite so imminent
To common ways as the defeat Success
Turns into when it puts aside the dreams
That made it be, and, somehow, grows content
With what it is, forever giving less
Until it is not, and no longer seems.
.
Glenn Ward Dresbach
(Sept 9, 1889 – Jun 28, 1968)
American poet
Read Poet’s bio here:
http://www.encyclopediaofarkansas.net/encyclopedia/entry-detail.aspx?entryID=3074
Poem Courtesy:
https://archive.org/stream/contemporaryvers00storrich/contemporaryvers00storrich_djvu.txt
స్పందించండి