నీడపట్టున నివసించేవాళ్ళు … హోవర్డ్ ముంఫోర్డ్ జోన్స్ , అమెరికను కవి

నీడపట్టున నివసించేవాళ్ళు
చూపుమేర వ్యాపించిన నీడల మైదానాలలో
భ్రాంతికలిగించే తెలినురుగు తీరాలవెంట
ప్రేతాత్మల్లా నిరంతరం సంచరిస్తూనే ఉంటారు.
వాళ్ళజీవితాలలో ఏ కోశానా ఆశ కనిపించదు
ఐనప్పటికీ వాళ్ళు మరణించలేరు,
బావురుమనే వాళ్ళ సముద్ర తీరాల్ని వదలలేరు
అసంతృప్తికరమైనా, వాళ్ళ ఊహల్ని వదులుకోలేరు.

నీడపట్టున నివసించేవాళ్ళు
ఎండుటాకుల కదలికల్లా మాటాడుతుంటారు.
పచ్చనిమైదానాలతో మాటాడేటపుడు
ఎవరికీ సంతోషమూ ఉండదు, విచారం ప్రకటించరు.
వాళ్ళు అలా గుసగుసలాడుతూనే ఉంటారు అంతే
బహుశా బిక్కుబిక్కుమని ఒంటరిగా ఒడ్డుకుచేరే కెరటాలకీ
అక్కడ నివసించే మనిషికి తప్ప మరోమనిషికి
వాళ్ళు ఏం మాటాడుతున్నారో అర్థం కాదు.

నీడపట్టున నివసించేవాళ్ళు
మంచివాళ్ళూ కాదు, అలాగని చెడ్డవాళ్ళూ కాదు.
వాళ్ళ హృదయాలుకూడా పచ్చికబీళ్ళలా
దిగులుతో, ఏ మార్పూలేకుండా ఉంటాయి.
వాటిచుట్టూ ఉన్నప్రపంచం ఎన్నడో గతించింది
మీదనున్న ఆకాశాలు మబ్బుల్లేక ఖాళీగా ఉన్నాయి.
నేనొకసారి అక్కడికి వెళ్ళడం తటస్థించింది
వాటి గుసగుసలన్నీ రైతుకోసం ఆవేదనతోనే.
.
హోవర్డ్ ముంఫోర్డ్ జోన్స్
(April 16, 1892 – May 11, 1980)
అమెరికను కవి

.

howard-mumford-jones

.

They That Dwell in Shadow

 .

They that dwell in shadow

  Perpetually roam

In leagues of spectral meadow,

  By phantom miles of foam.

Their lives are very weary,

  And yet they cannot die,

Leave their sea-beaches dreary,

  Or change that bitter sky.

They that dwell in shadow,

  They twitter like dry leaves

In talk along the meadow,

  And none is glad, or grieves.

They whisper, whisper only,

  And no man, save he dwell

Beside those sea waves lonely

  Knows what it is they tell.

They that dwell in shadow

  Are neither good nor bad;

Their hearts are like the meadow,

  Monotonous and sad.

The world has died around them,

  The skies are blank above:

I happened there and found them—

  Their whispers were of love.

  .

Howard Mumford Jones

(April 16, 1892 – May 11, 1980)

American intellectual historian, literary critic, journalist, poet, and professor of English at Harvard University

Pulitzer for non-fiction

Poem courtesy:

http://www.bartleby.com/273/57.html

The Midland, A Magazine of the Middle West

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: