అనువాదలహరి

ముగ్గురు బాలికలు… హేజల్ హాల్, అమెరికను కవయిత్రి

ముగ్గురు బాలికలు ఇటువైపునుండే రోజూ బడికెళ్తుంటారు
అందులో ఇద్దరు, ఆడపిల్లలకి సహజంగా ఉండే భయాలతో
బెదురుతూ బెదురుతూ వెళుతూ ఉంటారు.
ఒకమ్మాయి మాత్రం కళ్ళలో కలలతో నడిచిపోతుంటుంది.

ఆ ఇద్దరికీ ఆడపిల్లలలకుండే బెరుకుచూపులున్నాయి
వాళ్ళ జుత్తు వంకీలకే వంకలుపెడుతోందా అన్నట్టు ఉంది
కానీ, ఆ మూడో అమ్మాయి కళ్ళు ఎక్కడో ఊహాతీరాలవైపు
తెరుచుకున్న విశాలమైన తలుపుల్లా ఉంటాయి.

వాళ్ళు ఈ రోజు వెళ్ళినట్టే వెళ్తారు
క్షణికమైన ఈ జీవితపు చరమాంకందాకా;
మొదటిద్దరికీ జీవితం ఏదిస్తే అదే అనుభవమౌతుంది
మూడో అమ్మాయికి కంటినిండా కల ఉంటుంది.

మొదటి ఇద్దరూ, ఎప్పుడో ఒకనాడు మట్టిలోంచి
వచ్చినవాళ్లు మట్టిలో కలవక మానరు.
కానీ మూడో అమ్మాయి మట్టిలో కలిసేదాకా బ్రతకదు,
ఆమె కల భగ్నమైననాడే, ఆమె జీవితం చాలిస్తుంది.
.

హేజల్ హాల్ 

(February 7, 1886 – May 11, 1924)

అమెరికను కవయిత్రి

.

.

Three Girls

 .

Three school-girls pass this way each day:

Two of them go in the fluttery way

Of girls, with all that girlhood buys;

But one goes with a dream in her eyes,

Two of them have the eyes of girls

Whose hair is learning scorn of curls,

But the eyes of one are like wide doors

Opening out on misted shores.

And they will go as they go to-day

On to the end of life’s short way;

Two will have what living buys,

And one will have the dream in her eyes.

Two will die as many must,

And fitly dust will welcome dust;

But dust has nothing to do with one—

She dies as soon as her dream is done.

Hazel Hall

(February 7, 1886 – May 11, 1924)

American Poetess

 

The Century Magazine

Poem Courtesy: http://www.bartleby.com/273/64.html

ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది.
రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది
కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు
నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది

రేయి నిద్రపోడానికీ, కలలు కనడనికే అయినా
ఎంత చూసినా, రాత్రి మొత్తంలో ఏ రైలూ ఇటు రాదు;
కానీ నాకు ఆకాశంలో ఎగురుతున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి
దాని ఇంజనులోంచి ఎగజిమ్ముతున్న ఆవిరిచప్పుడు వినిపిస్తోంది.

నే నేర్పరచుకున్న స్నేహాలవల్ల మనసు హాయిగా ఉంది
అంతకంటే మంచి స్నేహితులు దొరుకుతారనుకోను
అయినప్పటికీ, స్నేహితులుదొరుకుతారంటే
నేను ఎక్కని రైలంటూ ఉండదు, అది ఏవూరు వెళ్ళనీ.
.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org

.

Travel

.

The railroad track is miles away,

And the day is loud with voices speaking,

Yet there isn’t a train goes by all day

But I hear its whistle shrieking.

All night there isn’t a train goes by,

Though the night is still for sleep and dreaming,

But I see its cinders red on the sky,

And hear its engine steaming.

My heart is warm with the friends I make,

And better friends I’ll not be knowing,

Yet there isn’t a train I wouldn’t take,

No matter where it’s going.

.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poet  and Playwright

Poem Courtesy:

http://www.blackcatpoems.com/m/travel.html

ఫిరంగుల మోత… రిచర్డ్ ఆల్దింగ్టన్, ఇంగ్లీషు కవి

నాలుగురోజులపాటు భూమి
ఇనపగుళ్ళ వర్షానికి పగిలి ముక్కలైంది.
మా చుట్టూ ఉన్న ఇళ్ళు నేలమట్టమయాయి;
మృత్యుసంకేతమైన ఇల్లుకూలిపోయిన శబ్దం
ఎప్పుడు వినబడుతుందోనని చెవులు రిక్కించి
భయంతో,చెమటలు కక్కుకుంటూ
మూడురోజులూ అసలు నిద్రపోడానికి ధైర్యం చాలలేదు.

నాలుగోనాటి రాత్రి ప్రతిఒక్కరూ,
నరాలు పిట్లిపోయి, అలసట అంచులకు చేరి,
నిద్రపోయాం, నిద్రలొ గుంజుకుంటూ, ఏవో గొణుక్కుంటూ
పైన ఫిరంగులు అలా మోతమోగుతున్నా.

ఐదవరోజుకి ఒక్కసారి ప్రశాంతత వచ్చింది;
మేము మా కలుగుల్లోంచి బయటకి వచ్చాం
నేలమీద జరిగిన విధ్వంసాన్ని చూశాము.
నిశ్చలంగా ఉన్న నీలాకాశంమీద
తెల్లని మేఘాలు మౌనంగా బారులుతీరి కవాతుచేస్తున్నాయి.
.

రిచర్డ్ ఆల్దింగ్టన్

8 July 1892 – 27 July 1962

ఇంగ్లీషు కవి .

.

Bombardment

.

Four days the earth was rent and torn

By bursting steel,

The houses fell about us;

Three nights we dared not sleep,

Sweating, and listening for the imminent crash

Which meant our death.

The fourth night every man,

Nerve-tortured, racked to exhaustion,

Slept, muttering and twitching,

While the shells crashed overhead.

The fifth day there came a hush;

We left our holes

And looked above the wreckage of the earth

To where the white clouds moved in silent lines

Across the untroubled blue.

.

(From:  Images of War, 1919)

Richard Aldington

8 July 1892 – 27 July 1962

English Writer and Poet; Architect of Imagism movement in 20th century literature along with Ezra Pound and HD (Hilda Doolittle)

మార్మిక కవిత 2… రూమీ, పెర్షియను సూఫీ కవి

వివేకం అంది,”చూస్తుండు, అతన్ని నా వాదనతో వంచిస్తాను;”అని.
ప్రేమ అంది, “ఊరుకో! నేనతన్ని మనసుతో వంచిస్తాను.” అని

మనసు హృదయంతో అంది, “ఫో!నన్ను చూసీ,
నిన్ను చూసీ నవ్వకు. అతనిది కానిదేముందని
అది చూపి అతన్ని మోసగించడానికి?
అతనికి విచారంలేదు, ఆందోళన లేదు, అజ్ఞాతమే కొరుకుంటున్నాడు
పోనీ అతనికి మద్యాన్నీ, అధికమొత్తంలో ధనాన్నీ చూపి వంచిద్దామన్నా.
అతని చూపులతూపులు ఏ వింటినుండీ వెలువడటంలేదు
ప్రతిగా మరొక వింటినుండి చూపుల అమ్ములతో ఖండించడానికి.
అతనీ ప్రపంచానికి ఖైదీ కాడు, ఈ నేలకి ఏ సంకెళ్లతో
అతుక్కుపోలేదు అతనికి బంగారునిధులూ, రాజ్యాలూ ఇచ్చి వశపరచుకుందికి.
మనిషి రూపంలో కనిపిస్తున్నప్పటికీ, అతనొక దేవదూత.
అతనికి ఏవ్యామోహమూ లేదు, స్త్రీలను ఎరవేసి మోసపుచ్చడానికి.
ఇటువంటి ఆకారం ఎక్కడ వసిస్తే, అది దేవదూతలకు స్థావరమౌతుంది
కనుక అతన్ని అటువంటి ఆకారాలూ రూపాలూ చూపి ఏం లోబరచుకోగలను?
అతను ఏ గుర్రాలమీదా స్వారీ చెయ్యడు అతను ఊహల్లో విహరిస్తాడు గనుక;
అతను తినేదే తక్కువ, ఇక ఏ విందుభోజనం ఆశపెట్టను?
ఈ ప్రపంచ విఫణుల్లో అతను బేహారీకాడు, వర్తకుడూ కాదు
పోనీ అతనికి లాభనష్టాల బేరీజు వేసి మోసగిద్దామన్నా.
అతనికి ఏ కపటవేషాలూ లేవు, నేను రోగిలా నటిస్తూ,
నిట్టూరుస్తూ, అతన్ని రోదనతో వంచించడానికి.
నేను నా తలని దగ్గరాకట్టుకుని ప్రణమిల్లుతాను దోవతప్పినందుకు;
అతని అనుకంపని రోగమనీ, మనోవ్యాధనీ మోసగించను
అతను నా వక్రబుద్ధిని, నటననీ ఒక్కొక్కకేశాన్నీ విడదీసి చూడగలడు.
అతనికి ఏది అందుబాటులోలేదని దాన్ని చూపి అతన్ని మోసపుచ్చడానికి?
అతనికి కీర్తి కాంక్షలేదు, కవులంటే వ్యామోహమున్న రాజూ కాదు,
పోనీ గీతాలతో, అద్భుతమైన కవిత్వంతో వశపరచుకుందికి.
ఆ నిరాకారస్వరూపపు తేజోమహిమ మరీ గొప్పది
వరమనుగ్రహించో, స్వర్గాన్ని ఎరచూపించో వంచించడానికి.
అయితే ఒక్కటి, షామె తబ్రీజ్(Shams-e Tabriz), అతనికి ఇష్టుడూ, గురువూ
అతని వేషం ధరించి మాత్రం నేను వంచించడానికి ప్రయత్నిస్తాను.
.
రూమీ

పెర్షియను సూఫీ కవి

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

Mystical Poem 2

.

Reason says, “I will beguile him with the tongue;”

Love says, “Be silent. I will beguile him with the soul.”

The soul says to the heart, “Go, do not laugh at me

and yourself. What is there that is not his, that I may beguile him thereby?”

He is not sorrowful and anxious and seeking oblivion

that I may beguile him with wine and a heavy measure.

The arrow of his glance needs not a bow that I should

beguile the shaft of his gaze with a bow.

He is not prisoner of the world, fettered to this world

of earth, that I should beguile him with gold of the kingdom of the world.

He is an angel, though in form he is a man; he is not

lustful that I should beguile him with women.

Angels start away from the house wherein this form

is, so how should I beguile him with such a form and likeness?

He does not take a flock of horses, since he flies on wings;

his food is light, so how should I beguile him with bread?

He is not a merchant and trafficker in the market of the

world that I should beguile him with enchantment of gain and loss.

He is not veiled that I should make myself out sick and

utter sighs, to beguile him with lamentation.

I will bind my head and bow my head, for I have got out

of hand; I will not beguile his compassion with sickness or fluttering.

Hair by hair he sees my crookedness and feigning; what’s

hidden from him that I should beguile him with anything hidden.

He is not a seeker of fame, a prince addicted to poets,

that I should beguile him with verses and lyrics and flowing poetry.

The glory of the unseen form is too great for me to

beguile it with blessing or Paradise.

Shams-e Tabriz, who is his chosen and beloved – perchance

I will beguile him with this same pole of the age.

.

Rumi

“Mystical Poems of Rumi 2” A. J. Arberry

The University of Chicago Press, 1991

కవిహృదయం… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను

(మనవి : ఈ కవితకి శీర్షిక లేదు. ఎలా వీలర్ విల్ కాక్స్ తన Poems of Passion అన్న పుస్తకంలో ముందుమాటకంటే  ముందుగా ఈ కవితని పెట్టుకుంది.)

***

ఓ పాఠకుడా!నేను పాడుకున్న ఏదో గీతాన్ని చదివినంతమాత్రాన

ఏ హృదయపులోతులలోంచి వచ్చిందో నువ్వు పసిగట్టగలవా?

కవి కన్న కల ఎన్నడైనా బయటకు గట్టిగా చెబుతుందా

దాని రహస్యపుటాలోచనలను వింటున్న జనసమూహానికి?

ఏదీ, లేచి సముద్రపుటొడ్డునున్న ఒక శంఖుని తీసుకో—

నీకేమిటి కనిపిస్తుంది? దాని ఆకారం, రంగూ. అంతే!

విశాలమైన మహాసాగరపు అట్టడుగున దాగున్న

రహస్యాలలో ఏ ఒక్కటైనా నీకు చెబుతుందా?

మనగీతాలన్నీ అలాటి శంఖులే, లోచనాసముద్రాలు ఒడ్దుకు విసిరినవి;

ఇప్పుడు నీకు ఏది ఆనందాన్నిస్తే దాన్ని ఏరుకో; అంతేగాని

నువ్వు సముద్రపు అలలదిగువనంతా చూసేనని పొరబడకు.

అక్కడ మునకలేసిన ఓడలేకాదు, పగడపు దీవులుంటాయి.

.

ఎలా వీలర్ విల్ కాక్స్

November 5, 1850 – October 30, 1919

అమెరికను కవయిత్రి

.

.

Oh, you who read some song that I have sung—

What know you of the soul from whence it sprung?

Dost dream the poet ever speaks aloud

His secret thought unto the listening crowd?

Go take the murmuring sea-shell from the shore—

You have its shape, its color —and no more.

It tells not one of those vast mysteries

That lie beneath the surface of the seas

Our songs are shells, cast out by waves of thought,

Here, take them at your pleasure; but think not

You’ve seen beneath the surface of the waves,

Where lie our shipwrecks, and our coral cave.

.

Ella Wheeler Wilcox

November 5, 1850 – October 30, 1919

American

Page 7, Poems of Passion,

Belford-Clarke Co. Chicago, 1890.

కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవి

ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను
నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా.
గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా
పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది;
అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి;
“అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా!
నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో
పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?”
అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి.
అయినప్పటికీ చివరిసారిగా విసిరేను సముద్రంలోకి
చివరికి ఎమవుతుందోనని ఎదురు చూస్తూ.
వావ్ ! పరమాద్భుతమైన వెలుగులు!
ధవళ కాంతులతో ఆకాశానికి బాలుడు ఎగబ్రాకుతున్నాడు.
ఆ ఆనందంలో వేదనామయమైన గతాన్ని మరిచిపోయాను .
.

ఆస్కార్ వైల్డ్

16 October 1854 – 30 November 1900

ఐరిష్ కవి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

Vita Nuova

.

I stood by the unvintageable sea

Till the wet waves drenched face and hair with spray,

The long red fires of the dying day

Burned in the west; the wind piped drearily;

And to the land the clamorous gulls did flee:

‘Alas!’ I cried, ‘my life is full of pain,

And who can garner fruit or golden grain,

From these waste fields which travail ceaselessly!’

My nets gaped wide with many a break and flaw

Nathless I threw them as my final cast

Into the sea, and waited for the end.

When lo! a sudden glory! and I saw

The argent splendour of white limbs ascend,

And in that joy forgot my tortured past.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet, Playwright, Novelist

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/vita-nuova/

రేపు సూర్యోదయం వేళకి… విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి

హ్యూగో పెద్ద కూతురు 19 ఏళ్ళ లెపాల్డైన్ ప్రమాదవశాత్తూ సెప్టెంబరు 4, 1843 లో సియాన్ నదిలో పడి, ఆమెను కాపాడబోయిన భర్తతో సహా మరణిస్తుంది. ఆమె స్మృతిలో రాసిన కవిత. ఆమె సమాధిని దర్శించడానికి వెళ్ళిన ఒక సందర్భంలో రాసిన ఈ కవిత అతనికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.)
.

రేపు, సూర్యోదయం వేళకి, పల్లెలు తెల్లదనాన్నలముకుంటూంటే
నేను బయలు దేరుతాను. నాకు తెలుసు నువ్వు నాకోసం నిరీక్షిస్తుంటావని.
నేను కొండలు ఎక్కి అడవిగుండా ప్రయాణం చేస్తాను.
నేను నీకు దూరంగా ఎక్కువ కాలం ఉండలేను.
నేను అలా కాళ్ళీడ్చుకుంటూ, ఆలోచనల్లో దృష్టి పెడుతూ,
నా పరిసరాల్ని మరచి, ఏ చప్పుడునీ లక్ష్యం చెయ్యకుండా.
ఒంటరిగా, ఎవరికీ తెలియకుండా, నడుము వంగి, చేతులు కట్టుకుని
విచారంతో నడుస్తాను. ఆ పగలు నాకు రాత్రిలా ఉంటుంది.
సంధ్యాసమయం వెదజల్లే బంగారు కాంతుల్నీ గుర్తించలేను,
దూరాన “ఆర్ ఫ్లోర్(Harfleur)” రేవుకు చేరుకుంటున్న ఓడలనీ గుర్తించలేను. 
వచ్చి నీ సమాధిమీద నీ కిష్టమైన పచ్చని “(హోలీ Holly)”
పూలు గుత్తినీ, పూలతో ఉన్న కొమ్మనూ ఉంచుతాను
.

విక్టర్ హ్యూగో

26 February 1802 – 22 May 1885

ఫ్రెంచి కవి, నాటక కర్త, నవలాకారుడు

.

.

Tomorrow, at dawn

*(About the visit to his daughter’s Grave)

Tomorrow, at dawn, at the hour when the countryside whitens,

I will depart. You see, I know you wait for me.

I will go through the forest and over the mountains.

I cannot stay far from you any longer.

I will trudge on, my eyes fixed on my thoughts,

Ignoring everything around me, without hearing a sound,

Alone, unknown, back stooped, hands crossed,

Saddened, and the day will be like night for me.

I will neither see the golden glow of the falling evening,

Nor the sails going down to Harfleur in the distance,

And when I arrive, I will place on your tomb

A bouquet of green holly and flowering heather.

.

Victor Hugo

26 February 1802 – 22 May 1885

French Poet, Novelist Dramatist

(From: Les Contemplations)

 

*Note: Hugo’s eldest and favourite daughter, Léopoldine, died aged 19 in 1843, shortly after her marriage to Charles Vacquerie. On 4 September, she drowned in the Seine at Villequier, pulled down by her heavy skirts when a boat overturned. Her young husband also died trying to save her. The death left her father devastated.

నీరు … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

అన్ని మతాల్లోనూ నీటిప్రాముఖ్యత గురించి కవి ఈ కవితలో పరోక్షంగా చెబుతున్నాడు.

.

నన్నే గనక
ఒక మతాన్ని స్థాపించమని చెబితే
నేను నీటిని ఉపయోగించాల్సి వస్తుంది.

చర్చికి వెళ్ళాలంటే
పాదాలు తడిసే నీళ్ళలోంచి నడవాలి
వేరే రకమైన వస్త్రాలు ఆరబెట్టాలి.

నా ప్రార్థనలూ పూజల్లో
భక్తితో స్నానం చెయ్యడం
నీటిలో నిలువునా తడవడం వంటి దృశ్యాలుంటాయి.

నేను ‘తూర్పు’కి ఒక
గ్లాసుడు నీళ్ళు ఎత్తితే చాలు
దానిమీద ప్రతిఫలించే ఏపాటి కాంతైనా
తండోపతండాలుగా ప్రజల్ని సమీకరిస్తుంది.
.
ఫిలిప్ లార్కిన్

(9 August 1922 – 2 December 1985)

ఇంగ్లీషు కవి.

.

Water

If I were called in

To construct a religion

I should make use of water.

Going to church

Would entail a fording

To dry, different clothes;

My litany would employ

Images of sousing,

A furious devout drench,

And I should raise in the east

A glass of water

Where any-angled light

Would congregate endlessly.

.

Philip Arthur Larkin

(9 August 1922 – 2 December 1985)

English Poet

http://wonderingminstrels.blogspot.in/search/label/Poet%3A%20Philip%20Larkin

ఇదిగో నీకే…. వాల్ట్ విట్మన్, అమెరికను

పద! అందరికీ దూరంగా మనిద్దరం కలిసినడుద్దాం;

ఇక మనిద్దరం ఏకాంతంగా ఉన్నాం గనుక
కాసేపు మర్యాదలన్నీ పక్కనబెడతావా?
ప్రారంభించు! నువ్వింతవరకు ఎవరికీ చెప్పనిది నాతో చెప్పు.
విషయమంతా ఉన్నదున్నట్టుగా చెప్పు.
నువ్వు నీ సోదరుడికీ, నీ భార్యకీ (లేదా భర్తకీ), వైద్యుడికీ చెప్పనివన్నీ వినిపించు.

.

వాల్ట్ విట్మన్

మే 31, 1819 – మార్చి 26, 1892 పద

అమెరికను

.

.

To You

.

Let us twain walk aside from the rest;

Now we are together privately,

do you discard ceremony,

Come! Vouchsafe to me what has yet been vouchsafed to none—

Tell me the whole story,

Tell me what you would not tell your brother, wife, husband, or physician.

.

Walt Whitman

May 31, 1819 – March 26, 1892

American poet

Poem Courtesy:

http://100.best-poems.net/you.html

 

 

మా పూర్వీకుల గ్రామంలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఒకరు నన్ను కాగలించుకుంటారు
ఒకరు నా వంక తోడేలులా చూస్తారు
మరొకరు తన టోపీని తీస్తారు
తనని నేను బాగా చూడగలిగేలా.

ప్రతివారూ నన్నడుగుతుంటారు
నేన్నీకు ఏమౌతానో చెప్పగలవా అంటూ

ఎన్నడూ ఎరుగని వృద్ధ స్త్రీలూ, పురుషులూ
నా చిన్నప్పటి జ్ఞాపకాలలోనిలిచిన పేర్లు
చెబుతూ … వాళ్ళు తామే అంటారు.

అందులో ఒకర్ని అడుగుతాను:
నామీద దయ ఉంచి చెప్పండి
“తోడేలు జార్జి” ఇంకా బ్రతికున్నాడా?

ఏదో మరో లోకంనుండి మాటాడినట్టు
ఒక వ్యక్తి “అది నేనే” అంటాడు.

అతని చెంపలు నా చేత్తో రాస్తూ
కళ్ళతోనే సంజ్ఞచేస్తాను:
నేనింకా బ్రతికే ఉన్నానా? అని.

.

వాస్కో పోపా

June 29, 1922 – January 5, 1991

సెర్బియన్ కవి.

.

.

In the Village of My Ancestors

.

Someone embraces me

Someone looks at me with the eyes of a wolf

Someone takes off his hat

So I can see him better

Everyone asks me

Do you know how I’m related to you

Unknown old men and women

Appropriate the names

Of young men and women from my memory

I ask one of them

Tell me for God’s sake

Is George the Wolf still living

That’s me he answers

With a voice from the next world

I touch his cheek with my hand

And beg him with my eyes

To tell me if I’m living too

.

Vasko Popa

June 29, 1922 – January 5, 1991

Serbian Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/in-the-village-of-my-ancestors/

 

%d bloggers like this: