వాళ్ళిచ్చిన ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? … ఓసిప్ మాండెల్ స్టామ్, రష్యను

ఇంత స్వంతమై, నాతో ఇంత ఆత్మీయంగా మసిలే

ఈ శరీరాన్ని నేనేం చేసుకోను?

బ్రతికున్నందుకూ, ప్రశాంతంగా ఊపిరిపీలుస్తున్నందుకూ,

తెలిస్తే నాకు చెప్పు, ఎవర్ని స్తుతించాలో?

నేనే పువ్వునీ, తోటమాలిని కూడా

ఈ అఖండ భూగృహంలో నేను ఒంటరివాణ్ణి కాను.

నేను విడుస్తున్న ఈ వెచ్చని ఊపిరి

కాలమనే నిర్మలమైన అద్దంమీద నువ్వు చూడగలవు.

అందులో ఇప్పటిదాకా కనీకనిపించని

ఒక ఆకారం స్పష్టంగా రూపుకట్టి ఉంది.

ఈ ఊపిరి దాని జాడ మిగల్చకుండా ఎక్కడికో నిష్క్రమిస్తుంది

కానీ, ఈ రూపాన్ని ఎవ్వరికీ చెరుపశక్యం కాదు.

.

ఓసిప్ మాండెల్ స్టామ్

15 January 1891 – 27 December 1938

రష్యను

.

Osip Mandelstam Photo Courtesy: Wikimedia Commons
Osip Mandelstam
Photo Courtesy: Wikimedia Commons

.

‘What shall I do with this body they gave me,’

.

What shall I do with this body they gave me,

so much my own, so intimate with me?

For being alive, for the joy of calm breath,

tell me, who should I bless?

I am the flower, and the gardener as well,

and am not solitary, in earth’s cell.

My living warmth, exhaled, you can see,

on the clear glass of eternity.

A pattern set down,

until now, unknown.

Breath evaporates without trace,

but form no one can deface.

.

Osip Mandelstam

15 January 1891 – 27 December 1938

Russian

Poem Courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Russian/Mandelstam.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: