స్నేహంగా పలకరించే పాతవ్యధల ముఖాలే నాకిష్టం;
వాటికి తెలియని రహస్యాలంటూ నాకు ఏవీ లేవు.
అవెంత పాతవంటే, అప్పుడెప్పుడో, ఎంత పరుషమైన మాటలు
నేను వినాల్సొచ్చిందో అవి ఈపాటికి మరిచిపోయి ఉంటాయి.
తీక్ష్ణమైన, కనికరంలేని కొత్త వ్యధలచూపులంటే నాకసహ్యం; ఎప్పుడూ
ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను పట్టుకుని అలా నిలబడి నన్నే పరీక్షిస్తుంటాయి.
పాత వ్యధలు ఎంత మార్పుకు లోనయ్యాయో గుర్తుంచుకోగలిగితే
బహుశా, నేను మరింత ధైర్యంగా ఉండగలిగేదాన్నేమో!
.
కార్ల్ విల్సన్ బేకర్
13 Oct 1878 – 8 Nov 1960
అమెరికను కవయిత్రి
.

స్పందించండి