హేమంతము ఇలా గతించింది
వసంతం అలా అడుగుపెట్టింది
నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని
అక్కడి కలకూజితాలు వింటాను.
అక్కడ మావి చిగురుల్లో
కోయిల మనోహరంగా పాడుతుంది
అక్కడ పూల పొదల్లో
మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది
ఆ చల్లని ఇంటికప్పుమీదకి
దట్టంగా ఎగబాకిన లతలు
గుబురుపొదలై మొగ్గతొడుగుతూ
నెత్తావులు పరుచుకుంటున్నాయి
సుగంధాలు నింపుకున్న
అల్లరిగా తిరిగే చిరుగాలి
మెల్లగా గుసగుసలాడుతోంది:
“ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు;
“ఇక్కడ క్షేమంగా వసించు
ఒంటరిగా నివసించు
స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు
నాచుపట్టిన బండరాయీ అవిగో.
“ఇక్కడ సూర్యుడు చల్లని
నీడలు పరుస్తాడు
దూరాననున్న సముద్రపుహోరు
ప్రతిధ్వని వినిపిస్తుందిక్కడ
అదెంతదూరాన్నున్నా!”
.
క్రిస్టినా రోజేటి
(5 December 1830 – 29 December 1894)
ఇంగ్లీషు కవయిత్రి

Portrait by her brother Dante Gabriel Rossetti
courtesy: Wikipedia
స్పందించండి