హృదయవేదన… నజీం హిక్మెత్, టర్కీ కవి

డాక్టర్ గారూ, నా గుండె సగం ఇక్కడ ఉంటే
రెండో సగం చైనాలో ఉంది
” యెల్లో రివర్ ” వైపు
పరుగులు తీస్తున్న సైనికులతో.
ప్రతిరోజూ, డాక్టర్ గారూ,
ప్రతి ఉదయమూ నా గుండె
గ్రీసులో గాయపడుతుంది.
ప్రతి రాత్రీ, డాక్టరు గారూ,
ఖైదీలందరూ నిద్రిస్తున్నపుడు,
ఆసుపత్రులన్నీ నిర్మానుష్యమైనపుడు,
నా గుండె ఇస్తాన్ బుల్ లో
ఒక పాడుబడ్డ ఇంటి ముందు ఆగిపోతుంది.

పదేళ్ళు గడిచేక
నా పేదప్రజలకి నేనివ్వగలిగింది
నా చేతిలో ఉన్న ఈ ఏపిలే డాక్టరుగారూ,
ఒక ఎర్రని ఏపిలు: అదే, నా గుండెకాయ.

అదే డాక్టరుగారూ అదే,
ఈ గుండెపోటుకి అదే కారణం…
నికోటీనూ, జైలూ, ధమనులు గట్టిబడడం కాదు.
నేను ఊచల్లోంచి రాత్రిని చూస్తుంటాను,
నా గుండెమీద ఇంత బరువున్నప్పటికీ
అనంత దూరాన ఉన్న నక్షత్రాలు చూడగానే
నా గుండె ప్రతిస్పందిస్తుంది.
.
నజీం హిక్మత్

(15 January 1902 – 3 June 1963)

టర్కీ కవి

.

Nazim Hikmet Turkish Poet courtesy: Wiki
Nazim Hikmet
Turkish Poet
courtesy: Wiki

.

Angina Pectoris

.

 If Half My Heart Is Here, Doctor,

       The Other Half Is In China

 With The Army Flowing

      Toward The Yellow River.

 And, Every Morning, Doctor,

 Every Morning At Sunrise My Heart

      Is Shot In Greece.

 And Every Night, Doctor,

 When The Prisoners Are Asleep And The Infirmary Is Deserted,

 My Heart Stops At A Run-Down Old House

                                        In Istanbul.

 And Then After Ten Years

 All I Have To Offer My Poor People

 Is This Apple In My Hand, Doctor,

 One Red Apple:

                My Heart.

 And That, Doctor, That Is The Reason

 For This Angina Pectoris-

 Not Nicotine, Prison, Or Arteriosclerosis.

 I Look At The Night Through The Bars,

 And Despite The Weight On My Chest

My Heart Still Beats With The Most Distant Stars.

.

Nazim Hikmet

(15 January 1902 – 3 June 1963)

Turkish Poet

Translated by Randy Blasing, Mutlu Konuk Blasing and Mutlu Konuk

poem courtesy: http://pgrnair.blogspot.in/2012_06_01_archive.html 

“హృదయవేదన… నజీం హిక్మెత్, టర్కీ కవి”‌కి ఒక స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: