రెండు సానెట్ లు… చార్ల్స్ హామిల్టన్ సోర్లీ, స్కాటిష్ కవి

I

సత్పురుషులు ఉదాత్తమైన నీ ఆత్మని శ్లాఘించారు.
మహోన్నతమైన నీ కీర్తిచంద్రికలకు కవులు సిగ్గుపడ్డారు.
నువ్వు చూపిన మార్గంలో నడవడానికి ఉద్యుక్యులైన
అనేకమంది సరసన మేమూ నిరీక్షిస్తూ నిలబడ్డాము.

ఇప్పుడు పేరుబడ్డా, ఒకప్పుడు నువ్వెవరో ఎవరికీ తెలీదు;
నీ ఉనికి గుర్తించకుండా జీవించడానికి ప్రయత్నించాము.
కానీ ఇపుడు ప్రతి వీధిలోనూ, ప్రతి దిక్కునా
నిలకడగా నిశ్చలంగా నీ గుర్తులున్న స్థంబాలు చూస్తున్నాము.

‘కొండలమీదకి ఎక్కడానికి మార్గము ‘అని సూచిస్తూ
మా ఊర్లో ఉన్న పాడుబడ్డ పొడుగాటి రాటని పోలి ఉంది.
కుడివైపున ఉన్న కొండలపై పొగమబ్బులు వేలాడుతుంటాయి
కొండగాలి అరుస్తూ ఈలవేస్తుంటుంది.
ఆదరించే స్నేహితుడుగాని, నాదనుకునే నేలగాని లేవు నాకు
ఈ నేలగురించి నాకు తెలియకపోయినా, తెలుసుకోవాలని ఉంది.

II

మృత్యువు సరిగ్గా అలాంటిదే; గెలుపూ లేదు: ఓటమీ లేదు;
ఒక ఖాళీ కడవ, శుభ్రంగా చెరిపేసిన పలక,
ఒకప్పటి అస్తిత్వాన్ని దయతో ఒకపక్కకి పోగుబెట్టడం.

ఇది మనకి తెలుసు: మృత్యువంటే బలహీనమైన జీవితం కాదు,
జీవితం కాలుకింద నలిప్ర్య్యడం, పగలగొట్టిన కుండ. జీవితంలో
ఎన్నో అద్భుతాలు చూసిన మనకి కథ ముగింపుకి రాలేదని తెలుసు.

గెలిచినవాడూ ఓడినవాడూ, పిరికివాడూ సాహసికుడూ
మిత్రుడూ శత్రువూ, మృత్యువులో అంతా ఒక్కటే. ఆత్మలు మిమ్మల్ని
“ఇలా రా! బ్రతికున్నప్పుడు నువ్వేమిటి సాధించేవో చెప్పు?” అని అడగవు.
కానీ, ప్రతి నిన్ననీ ఒక పెద్ద కళంకం మరుగుపరుస్తుంది.
అది అంత దీనమైనదీ, అంత అసమగ్రమైనదీ.
అంత ఉజ్జ్వలమైన నీ భవిష్యత్తూ, ఎప్పుడో వడలి గతించింది
గుర్తొస్తుంది; మళ్ళీ కదిలి, మారాకు తొడిగి, తియ్యగా మెదిలి,
పుష్పించి నువ్వు మరణించేక నీతోపాటే మరణిస్తుంది.

.

చార్ల్స్ హామిల్టన్ సోర్లీ

(19 May 1895 – 13 October 1915)

స్కాటిష్ కవి

Charles Hamilton Sorley

(19 May 1895 – 13 October 1915)

Scottish Poet

This is copyrighted poem. Please read at the following link:

http://gdancesbetty.blogspot.in/2010/09/two-sonnets-charles-hamilton-sorley.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: