యువత – యాత్రికుడూ…. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓ వృద్ధయాత్రికుడా, చాలా దేశాలు తిరిగావు,
ప్రేమలేని తావు ఎక్కడన్నా కనిపించిందా?
ఏ సముద్రతీరమైన ఫరవా లేదు
ఉంటే, దయచేసి నాకు విశదీకరించు.
నేను దేముడంటే విసిగిపోయాను
నాకతన్నించి దూరంగా పారిపోవాలనుంది
దిగంతాల అంచునున్న సముద్రతీరాలకి
నావవేసుకుని వెళ్ళాలన్నా నేను సిద్ధమే.
ప్రేమలేని రేవు నాకు తెలిసినదొకటుంది
అక్కడికి చేర్చే నావ నీ చేతిలోనే ఉంది
నీ కత్తిని నీ గుండేల్లోకి బలంగా దింపు
నువ్వు ఆ తీరానికి తిన్నగా చేరుకుంటావు.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
Youth and the Pilgrim
Gray pilgrim, you have journeyed far,
I pray you tell to me
Is there a land where Love is not,
By shore of any sea?
For I am weary of the god,
And I would flee from him
Tho’ I must take a ship and go
Beyond the ocean’s rim.
“I know a port where Love is not,
The ship is in your hand,
Then plunge your sword within your breast
And you will reach the land.”
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American
Poem Courtesy:
http://www.mckinley.k12.hi.us/ebooks/pdf/helen10.pdf
అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు … బాబ్ డిలన్, అమెరికను గాయకుడు
Whether it is America or it is India, it is easy to flare up passions in the name of any divisive factor you can conceive of. It is for the bounden duty of intellectuals to repair the damage caused by such vested interests instead of backing them up identifying with their cause. “Life and right to survive”is a fundamental right of every being on this earth. Nobody, no community or no race owns any piece of land on this earth or has any more right on a place than any other fellow being. All notions and demarcations of countries are just for matter of convenience. If you look into history of any family or race, they have been, and continue to be, migratory, nomadic or vagabonds. All of us are mendicants at the door step of this mother earth. However powerful they be at any given moment, all reigns since times immemorial have only been ephemeral. It is not in Nature’s trait to permit the dominance of even the most powerful species for long on this vast stretch. The secret of our survival lies in collective sharing and growth and not in appropriating the resources for the benefit of the few.
While the criminals are guilty, (in an event like the one given below) they don’t deserve the blame entirely. Look at the perpetrators. History is about to repeat in America this time instead of Germany.
——————————————————————————————————————————
Adam W. Purinton, 51, allegedly shot Srinivas Kuchibhotla, 32; Alok Madasani, 32, of Overland Park, and another bar patron, 24-year-old Ian Grillot of Grandview.
Kuchibhotla died at a hospital after the 7:15 p.m. shooting in Austins Bar & Grill near 151st Street and Mur-Len Road.
Read more here: http://www.kansascity.com/news/local/crime/article134459444.html#storylink=cpy
—————————————————————————————————————————–
Medgar Evers ఒక నల్లజాతి పౌరహక్కుల కార్యకర్త. అతన్ని అతని ఇంటి సమీపంలోనే 1963 జూన్ 12 వతేదీన కాల్చి చంపారు. అతని స్మృతిలో బాబ్ డిలన్ రాసిన గీతం ఇది.
***
ఒక పొద వెనకనుండి వచ్చిన తుపాకిగుండు మెడ్గార్ ఎవర్స్ ప్రాణం తీసింది
ఒక వేలు అతని పేరుని గురిచూసి కొట్టింది.
ఒక పిడి చీకటిలో దాగుంది.
ఒక చెయ్యి నిప్పుకణాలు విరజిమ్మింది
రెండు కళ్ళు లక్ష్యాన్ని గురిచూశాయి.
కానీ అతన్ని నిందించలేము
అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు
దక్షిణాది రాజకీయ నాయకుడు బీద తెల్లవాడితో అంటాడు
“మీకు నల్ల వాళ్లకంటే ఎక్కువే ముడుతోంది, ఫిర్యాదులొద్దు
మీరు వాళ్ళకంటే మెరుగు, మీరు తెల్లచర్మంతో పుట్టారు,” అంటాడు
ప్రత్యేకించి ఒక నల్లవాడి పేరు
తనకి లాభం చేకూర్చడానికి
అతను ప్రస్తావిస్తాడన్నది నిజం.
పాపం ఆ బీద తెల్లవాడు
ఆ రైలుబండిలోని వంటగదిలోనే మిగిలిపోతాడు.
కానీ అతన్ని మనం నిందించలేము.
అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు
డిప్యూటీ పోలీసు అధికారులూ, సైనికులూ, అధికారులందరికీ జీతాలొస్తాయి
మార్షల్స్ కీ, పోలీసులకీ జీతాలందుతాయి
పాపం ఆ బీద తెల్లవాదిని వాళ్ళందరూ ఒక సాధనంగా వాడుకుంటారు
ఆ తెల్లవాడికి బడిలో
మొదటినుండీ చట్టం
అతనికి అనుకూలంగా ఉంటుందని బోధిస్తారు
అందుకని అతడు తనని రక్షించుకుందికి
అతని ద్వేషాన్ని కొనసాగించడానికి
అతన్ర్టువంటి పరిస్థితిలో ఉన్నాడో
ఎన్నడూ తిన్నగా ఆలోచించడు.
అయినా అతన్ని నిందించడానికి ఏమీ లేదు
అతను వాళ్ళ చదరంగం ఆటలో కేవలం ఒక బంటు
పేద గుడిశల్లోంచీ అతను దారిపొడుగునా ఉన్న గోతులు చూస్తాడు
అతని మెదడులో గుర్రాల డెక్కలు హోరుమంటుంటాయి
అతనికి జనసమూహంలో నడవడం ఎలాగో మప్పుతారు
ఒక్క క్షణంలో
చేతులు నేర్పుగా వంచి
వెనకనుండి కాల్చడం
అదను చూసి కడతేర్చడమూ
టోపీకింద ముఖం కనిపించకుండా దాగోడమూ
గొలుసుకి కట్టిన కుక్కని
చంపినట్టు చంపడమూ మప్పుతారు
అతనికి ఏ పేరూ ఉండదు.
అయినా అతన్ని నిందించలేము
అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు
ఈ రోజు తూటాకి బలైన మెడ్గార్ ఎవర్స్ సమాధి చెయ్యబడ్డాడు
అతనికి రాజమర్యాదలతో వీడ్కోలు పలకబడింది
కానీ అతనిమీద తూటాపేల్చిన వ్యక్తి
జీవితం చరమాంకానికి వచ్చినపుడు
అతను తన సమాధి దగ్గర
శాశ్వతంగా మిగిలే శిలాఫలకం మీద
అతని పేరుకి ప్రక్కనే ఇలా రాసి ఉండడం చూస్తాడు:
‘అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు’
.
బాబ్ డిలన్
జననం 24 మే 1941
అమెరికను గాయకుడు

Medgar Evers was a black civil rights activist who was assassinated on June 12, 1963,outside of his home in Jackson, Mississippi. In 2017, President Barack Obama designated his home a national historic landmark. Bob Dylan wrote this song in commemoration of Evers.
View Dylan Singing the song here:
Only A Pawn In Their Game
A bullet from the back of a bush took Medgar Evers’ blood
A finger fired the trigger to his name
A handle hid out in the dark
A hand set the spark
Two eyes took the aim
Behind a man’s brain
But he can’t be blamed
He’s only a pawn in their game
A South politician preaches to the poor white man
“You got more than the blacks, don’t complain.
You’re better than them, you been born with white skin,” they explain.
And the Negro’s name
Is used it is plain
For the politician’s gain
As he rises to fame
And the poor white remains
On the caboose of the train
But it ain’t him to blame
He’s only a pawn in their game
The deputy sheriffs, the soldiers, the governors get paid
And the marshals and cops get the same
But the poor white man’s used in the hands of them all like a tool
He’s taught in his school
From the start by the rule
That the laws are with him
To protect his white skin
To keep up his hate
So he never thinks straight
’Bout the shape that he’s in
But it ain’t him to blame
He’s only a pawn in their game
From the poverty shacks, he looks from the cracks to the tracks
And the hoofbeats pound in his brain
And he’s taught how to walk in a pack
Shoot in the back
With his fist in a clinch
To hang and to lynch
To hide ’neath the hood
To kill with no pain
Like a dog on a chain
He ain’t got no name
But it ain’t him to blame
He’s only a pawn in their game.
Today, Medgar Evers was buried from the bullet he caught
They lowered him down as a king
But when the shadowy sun sets on the one
That fired the gun
He’ll see by his grave
On the stone that remains
Carved next to his name
His epitaph plain:
Only a pawn in their game
.
Bob Dylan
(Born 24 May 1941)
American
ఓ గులాబీ, పోయి చెప్పు… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి
ఓ గులాబీ! ఆమె సమయాన్నీ, నా సమయాన్నీ
వృథా చేసే ఆమెకి పోయి చెప్పు,
ఇప్పుడు ఆమెను నీతో సరిపోలుస్తున్నానని
ఆమెకి తెలుసు గనుక
ఆమె ఎంత అందంగా మనోహరంగా ఉంటుందో!
ఆమె సౌందర్యాన్ని తిలకించడాన్ని నిరసించే
ప్రాయంలో ఉన్న ఆమెకు చెప్పు
నువ్వేగాని మనిషిజాడలేని
ఎడారిలో పుట్టి ఉంటే
నిన్ను కీర్తించేవాళ్ళు లేక సమసిపోయేదానివని.
వెలుగుపొడ సోకని ఎంతటి అందానికైనా
విలువ అల్పమని చెప్పు
ఆమెని నలుగురిలోకీ రమ్మను
ఆమెను అందరూ కోరుకోడాన్ని సహించమను
ఆమెని పొగిడితే సిగ్గుపడొద్దను.
అన్ని అపురూపవస్తువుల్లాగే
ఆమెనీ సమసిపోనీ
అది నిన్ను చూసి నేర్చుకోమను
అందంగా మనోహరంగా ఉండేవన్నిటికీ
జీవితం ఎంత క్షణికమో తెలుసుకోనీ
.
ఎడ్మండ్ వేలర్
(3 March 1606 – 21 October 1687)
ఇంగ్లీషు కవి
.
Go, Lovely Rose
Go, lovely Rose-
Tell her that wastes her time and me,
That now she knows,
When I resemble her to thee,
How sweet and fair she seems to be.
Tell her that’s young,
And shuns to have her graces spied,
That hadst thou sprung
In deserts where no men abide,
Thou must have uncommended died.
Small is the worth
Of beauty from the light retired:
Bid her come forth,
Suffer herself to be desired,
And not blush so to be admired.
Then die-that she
The common fate of all things rare
May read in thee;
How small a part of time they share
That are so wondrous sweet and fair!
.
Edmund Waller
(3 March 1606 – 21 October 1687)
English Poet and Politician
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2000/10/go-lovely-rose-edmund-waller.html
హృదయంలేని ప్రియురాలు … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఓ ప్రకృతి కాంతా! నీ పాదాలముందు మోకరిల్లే వాడిని
పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా అని అడగవు.
మనస్ఫూర్తిగా ఎవడు నిన్ను సేవిస్తూ గీతాలు పాడినా,
గీతలు గీసినా విషాదంనుండి వినోదంవరకూ
స్పష్టంగా మోహనంగా రూపుకట్టే అసంఖ్యాక ఛాయల
నీ సౌందర్యవిలాసాన్ని పదిలంగా దాచుకుంటాడు.
అతని స్తోత్రపాఠాల పరిమళ ధూపం నిను చుట్టుముట్టుతుంది
ఒకవంక అతను నీ పాదాలముందు మోకరిల్లుతూంటే.
నీవే గనక హృదయంలేని ప్రియురాలిగా మారినట్టయితే
పాపం అతని పేద హృదయం మనశ్శాంతికై వెంపర్లాడుతుంది.
అపుడు అతనికి నీమీద పూర్వపు విశ్వాసమూ, శ్రద్ధా తిరోగమించి
సులభంగా తీర్చుకోగల అల్పప్రేమలవైపు మరలుతాడు.
అప్పుడతనికి నిన్ను కోల్పోడంలోని బాధ తెలిసొస్తుంది…
అతని ఆశలూ, ఆందోళనలూ కళావిహీనమైపోతాయి గనుక…
ఒకప్పుడు నీ పొందు పొంది, తర్వాత అల్పప్రేమలకు ప్రాకులాడే వాళ్ళు
ఒంటరిగా శేషజీవితం గడపవలసి వస్తుందని గ్రహిస్తాడు.
.
ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్
(1866-1925)
అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి
.
A Jealous Mistress
.
Thou askest not of him who kneels before thee,
O Nature, if he sinner be or saint,
But that with all his soul he shall adore thee,
And keep what gifts are his to sing or paint
Thy loveliness in all its myriad phases
Of sorrow or of laughter clear and sweet:
But only will the incense of his praises
Ascend to thee while he lies at thy feet.
And shouldst thou prove a mistress too exacting
For a poor human soul that seeks its ease,
So that, his one-time faith and creed retracting,
He turns to loves less difficult to please,
Ah then he‘ll know the pain of having missed thee—
So colourless are now all hopes and fears—
And he shall find that those who once have kissed thee
With lesser loves walk lonely all their years.
.
Antoinette De Coursey Patterson
(1866-1925)
American Poetess, Translator and Artist
Poem Courtesy:
The son of Merope, and other poems, Philadelphia HW Fisher& Co
MDCCCCXVI, P29
వాళ్ళిచ్చిన ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? … ఓసిప్ మాండెల్ స్టామ్, రష్యను
ఇంత స్వంతమై, నాతో ఇంత ఆత్మీయంగా మసిలే
ఈ శరీరాన్ని నేనేం చేసుకోను?
బ్రతికున్నందుకూ, ప్రశాంతంగా ఊపిరిపీలుస్తున్నందుకూ,
తెలిస్తే నాకు చెప్పు, ఎవర్ని స్తుతించాలో?
నేనే పువ్వునీ, తోటమాలిని కూడా
ఈ అఖండ భూగృహంలో నేను ఒంటరివాణ్ణి కాను.
నేను విడుస్తున్న ఈ వెచ్చని ఊపిరి
కాలమనే నిర్మలమైన అద్దంమీద నువ్వు చూడగలవు.
అందులో ఇప్పటిదాకా కనీకనిపించని
ఒక ఆకారం స్పష్టంగా రూపుకట్టి ఉంది.
ఈ ఊపిరి దాని జాడ మిగల్చకుండా ఎక్కడికో నిష్క్రమిస్తుంది
కానీ, ఈ రూపాన్ని ఎవ్వరికీ చెరుపశక్యం కాదు.
.
ఓసిప్ మాండెల్ స్టామ్
15 January 1891 – 27 December 1938
రష్యను
.

Photo Courtesy: Wikimedia Commons
.
‘What shall I do with this body they gave me,’
.
What shall I do with this body they gave me,
so much my own, so intimate with me?
For being alive, for the joy of calm breath,
tell me, who should I bless?
I am the flower, and the gardener as well,
and am not solitary, in earth’s cell.
My living warmth, exhaled, you can see,
on the clear glass of eternity.
A pattern set down,
until now, unknown.
Breath evaporates without trace,
but form no one can deface.
.
Osip Mandelstam
15 January 1891 – 27 December 1938
Russian
Poem Courtesy:
http://www.poetryintranslation.com/PITBR/Russian/Mandelstam.htm
తెల్లబడుతున్న ప్రకృతి… జేమ్స్ డి సెనెటో, సమకాలీన అమెరికను కవి
నాకు తెలుసు
అటకమీది కిటికీదగ్గర
చంద్రవంకల్లాంటి
మంచుపలకలు
ఈ హేమంతంలో
పేరుకుంటాయి.
వాటిలోంచి ప్రసరించే
సూర్యకిరణాలు
ఎర్రగా, నీలంగా
విడివడుతూ
నా కళ్ళలో ప్రతిఫలిస్తుంటాయి.
అక్కడి చల్లదనంలో
అచేతనత్వంలో
నేను నా ఊహల్లో
సిగరెట్లు తాగుతూ
ప్రపంచం చలికి
గడ్డకట్టుకుపోవడం గమనిస్తాను.
ఆ నా ఏకాంతంలో
నా కిటికీప్రక్కన దూదిమంచు
తేలియాడడం గమనిస్తున్నాను.
నేనున్న అనువైన ప్రదేశంనుండి
చెట్టు చివరలనుండి
క్రిందనున్న కంచెమీదకి
ఒక మంచు పలక ప్రయాణాన్ని
చూడగలుగుతున్నాను.
క్రమక్రమంగా పొదలన్నీ
“క్రంబ్ కేకు”ముక్కల్లా మారుతున్నై.
గడ్డిపరకలు మంచుతో
కప్పబడిపోయే లోపు
వీలయినంత నిటారుగా నిలబడుతున్నై.
ఇంటిప్రహారీలప్రక్కదారిలో
పిల్లుల కాలి జాడలు
మంచుమీద చిత్రవిచిత్రమైన
ఆకారాలు రచిస్తున్నాయి.
.
జేమ్స్ డి సెనెటో
సమకాలీన అమెరికను కవి
.
The Whitening
.
I remember
the attic window
would form
iced crescents
in the winter
and the sun’s rays
would separate
into blues and reds
as they passed through
and into my eyes.
There, in the chill
and stillness,
I’d smoke
imaginary cigarettes
and watch the world
bundle up against
the cold.
In my solitude
I could see the snow
float by my window
and from my vantage
I could trace
the path of a flake
from the tops of trees
to the hedgerow below
and in time the shrubs
would resemble crumb cakes
and the tips of grass
would reach out
before their snowy burial
and cat paws would leave
abstract images
on the whitening
sidewalk.
.
James D. Senetto
Contemporary American Poet.
Poem Courtesy:
http://gdancesbetty.blogspot.in/2010/04/whitening-james-d-senetto.html
For James D. Senetto’s Artwork & Poetry Pl. Visit :
http://www.talkofthetownband.com/Jim/jim.htm
నాకు ప్రేమగా పలకరించే గతవ్యధల ముఖాలంటేనే ఇష్టం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
స్నేహంగా పలకరించే పాతవ్యధల ముఖాలే నాకిష్టం;
వాటికి తెలియని రహస్యాలంటూ నాకు ఏవీ లేవు.
అవెంత పాతవంటే, అప్పుడెప్పుడో, ఎంత పరుషమైన మాటలు
నేను వినాల్సొచ్చిందో అవి ఈపాటికి మరిచిపోయి ఉంటాయి.
తీక్ష్ణమైన, కనికరంలేని కొత్త వ్యధలచూపులంటే నాకసహ్యం; ఎప్పుడూ
ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను పట్టుకుని అలా నిలబడి నన్నే పరీక్షిస్తుంటాయి.
పాత వ్యధలు ఎంత మార్పుకు లోనయ్యాయో గుర్తుంచుకోగలిగితే
బహుశా, నేను మరింత ధైర్యంగా ఉండగలిగేదాన్నేమో!
.
కార్ల్ విల్సన్ బేకర్
13 Oct 1878 – 8 Nov 1960
అమెరికను కవయిత్రి
.

I Love The Friendly Faces Of Old Sorrows
I love the friendly faces of old Sorrows;
I have no secrets that they do not know.
They are so old, I think they have forgotten
What bitter words were spoken, long ago.
I hate the cold, stern faces of new Sorrows
Who stand and watch, and catch me all alone.
I should be braver if I could remember
How different the older ones have grown.
.
Karle Wilson Baker
13 Oct 1878 – 8 Nov 1960
American Poetess
Poem courtesy: https://archive.org/stream/contemporaryvers00storrich/contemporaryvers00storrich_djvu.txt
శ్రామికుడు…. స్కడర్ మిడిల్ టన్, అమెరికను కవి
ష్! నా గుండెలో పనిచేసే శ్రామికుడా!
నువ్వలా పోటుపెడుతుంటే, నాకు నొప్పెడుతోంది.
రాత్రీ, పగలూ లేక, నీ సుత్తి బాదుతూనే ఉంటుంది
నువ్వేమిటి నిర్మిస్తున్నావో నాకు తెలియడం లేదు.
నీ శ్రమకి నాకు అలుపు వచ్చేసింది.
చక్కగా ప్రకాశిస్తున్న కొండమీద
దారితప్పిన ఒంటరి గొర్రెలా
నాకు నిశ్చలంగా ఉండాలనుంది.
విశ్రాంతిలేని నీ పిచ్చి బాదుడు ఆపు!
ఉత్సాహం తగ్గించుకుని తెలివిగా మసలుకో!
నువ్వు కలకాలం నిలిచేదేదీ నిర్మించడం లేదు.
నన్ను కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోనీ!
.
స్కడర్ మిడిల్ టన్
(September 9, 1888 – 1959)
అమెరికను కవి
.
The Worker
.
Be quiet, worker in my breast:
You hurt me, pounding so!
Day and night your hammer rings.
What you build, I do not know.
I am tired by your effort.
I would like to be as still
As the solitary sheep
Scattered on the sunny hill.
Stop your mad, insistent beating!
Be less eager and more wise!
You are building nothing lasting.
Let me rest and close my eyes.
.
Scudder Middleton
(September 9, 1888 – 1959)
American Poet
Poem Courtesy: http://www.bartleby.com/273/102.html
Harper’s Magazine
వసంతఋతు ప్రశాంతత … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
హేమంతము ఇలా గతించింది
వసంతం అలా అడుగుపెట్టింది
నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని
అక్కడి కలకూజితాలు వింటాను.
అక్కడ మావి చిగురుల్లో
కోయిల మనోహరంగా పాడుతుంది
అక్కడ పూల పొదల్లో
మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది
ఆ చల్లని ఇంటికప్పుమీదకి
దట్టంగా ఎగబాకిన లతలు
గుబురుపొదలై మొగ్గతొడుగుతూ
నెత్తావులు పరుచుకుంటున్నాయి
సుగంధాలు నింపుకున్న
అల్లరిగా తిరిగే చిరుగాలి
మెల్లగా గుసగుసలాడుతోంది:
“ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు;
“ఇక్కడ క్షేమంగా వసించు
ఒంటరిగా నివసించు
స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు
నాచుపట్టిన బండరాయీ అవిగో.
“ఇక్కడ సూర్యుడు చల్లని
నీడలు పరుస్తాడు
దూరాననున్న సముద్రపుహోరు
ప్రతిధ్వని వినిపిస్తుందిక్కడ
అదెంతదూరాన్నున్నా!”
.
క్రిస్టినా రోజేటి
(5 December 1830 – 29 December 1894)
ఇంగ్లీషు కవయిత్రి

Portrait by her brother Dante Gabriel Rossetti
courtesy: Wikipedia