నెల: జనవరి 2017
-
వ్యవసాయదారులు… విలియం అలెగ్జాండర్ పెర్సీ, అమెరికను
నేను రైతుల్ని వాళ్ళపొలాల్లో గమనిస్తూ నాలో నేను ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళు ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళలో ఎంతో హుందాతనం ఉంటుంది. అంత చిన్నవిషయాలూ ఎంతోబాగా తెలుసు వాళ్ళకి వాళ్ళు పెద్దగా చదువుకోనప్పటికీ. కొందరికి ఏమీ దొరకని చోట వాళ్ళు నిలకడగా పంటపండించగలరు. దేవునితో వాళ్ళు పడే తగవులన్నీ త్వరలోనే సర్దుబాటు చేసుకుంటారు. వాళ్ళతనికి క్షమాభిక్షపెడతారు వెండివెలుగుల వానజల్లు ఆలస్యంగా కురిసినా. పంటదిగుబడి తగ్గినపుడు వాళ్ళ వినోదాలు నిండుకుని, బాధలు ముంచెత్తుతాయి అందరికీ తెలిసిందే, వాళ్ళు దేమునిమీద…
-
ఏప్రిల్… లూయీ జిన్స్ బర్గ్, అమెరికను కవి
నా శరీరందీర్ఘనిద్రలో మునిగినా నాకు ఇప్పటికీ ఇంకా గుర్తే సాయంసంధ్యవేళ పొదలు తడిగా ఉన్నపుడు ఏప్రిల్ నెల మనసులో పుట్టించే కోరికలు. వీధులంట వెన్నాడే సంజెవెలుగులు ఎక్కడో దూరాన తీతువు అరుపులు అందంగా, గుండ్రంగా, మెత్తగాలేస్తూ, వానకడిగిన పున్నమి చంద్రుడు. అందుకే, తలూచుతున్న పచ్చగడ్డి క్రింద దానికింద పరుచుకున్న మంచు దిగువన ఓ ఏప్రిల్ మాసమా! నువ్వెప్పుడు అలా అడుగేసినా నా రేణువులు నీకై కలవరిస్తాయి! . లూయీ జిన్స్ బర్గ్ October 1, 1895 –…
-
ప్రకృతి ఆరాధకుడు మరణించేడు… డేనియల్ హెండర్సన్, అమెరికను
(ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని తెగలలో ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయినపుడు తేనెటీగలకి ఆ వార్త చెప్పే సంప్రదాయం ఉంది) *** తేనీగలారా! వెళ్ళండి అతని ఆస్తులు వివరించండి: ఓక్ చెట్టూ, పచ్చికా, పూలచెట్లూ… అతని జీవితాన్ని అంచనా వేసినా అతను వాటితోనే ఉన్నాడని చెప్పండి. అడవి పూలకీ, సుగంధభరితమైన గడ్డికీ భూమి అతన్ని తర్జుమా చేసిందని చెప్పండి. గలగలపారుతూ వంపులుతిరిగే వాగుకి చెప్పండి దాని కలలు అతను పంచుకునేవాడని. వేసవిలో విరిసే అడవులతో గుసగుసలాడండి వాటి…
-
చతురత…. ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్, అమెరికను
ఆమె చెప్పిన విధానం చూస్తే, (చెప్పినదాన్లో చాలవరకు నిజం), ఆమెకి ఇవ్వ వలసిన గౌరవాన్ని ఏ అహంకారమూ ఆపలేదు: ఆమె సులభంగా వంచించొచ్చు, కానీ ఆ పని ఆమె చెయ్యలేదు, అలా చేసుంటే పురుషుడు చిరునవ్వు నవ్వి మోసాన్ని అర్థం చేసుకునే వాడు. ఆమె అనుకున్నదానికంటే ఎక్కువ ఊహిస్తే, అన్నిటికీ ముగింపు పలకవస్తుందని తెలిసి అతను ఆగేడు; అతను వెళ్ళినపుడు ఉల్లాసమైన మాటతో వీడ్కోలు పలికేడు ఆ మాట అతనికి చుక్కలు మినుకుమినుకుమన్న రాత్రులలో అతను విన్న…
-
వాసంత భీతి… లెనోరా స్పేయర్… ఆమెరికన్ కవయిత్రి
నాకు వనాలలోకి పోవాలంటే భయం చెట్లన్నా, వాటి పచ్చని ఉన్మత్త ప్రాకారాలన్నా భయం. నా చొక్కా చేతులు లాగే చిరుగాలులన్నా భయం ఆకులగుబురులక్రింద ప్రాకే ‘ఆర్బ్యుటస్ ‘ లతలన్నా భయం. ఇచ్చవచ్చినట్టు తడిమాటలతో వెక్కిరించే సెలయేరన్నా భయం నేను పక్షుల కిలకిలారావాలు వింటే తడబడి పడిపోతుంటాను. అకస్మాత్తుగా వచ్చే ఆ చిరుజల్లుల సంగతి చెప్పక్కరలేదు విప్పారిన ఎర్రని కళ్ళతోభయపెట్టే పువ్వుల సంగతి చెప్పనక్కరలేదు. ఆ చిన్ని కీటకాలు ఒక్కసారి విచ్చుకున్న రెక్కలతో అవి నా చుట్టూ గోలచేస్తూ,…
-
వీడ్కోలు పాట… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
బ్లాగు మిత్రులకి, పాఠకులకీ, శ్రేయోభిలాషులకీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు దాన్ని మరిచిపోనీండి, ఒక పువ్వుని మరిచిపోయినట్టు ఒకప్పుడు పసిడికాంతులీనిన మంటను మరిచిపోయినట్టు. దాన్ని మరిచిపోనీండి ఎప్పటికీ, శాశ్వతంగా. కాలం ఒక మంచి మిత్రుడు, మనని త్వరగా వృద్ధుల్ని చేస్తాడు. ఎవరైనా అడిగితే, ఎప్పుడో చాలా రోజుల క్రిందటే, దాన్ని మరిచిపోయేనని చెప్పండి ఒక పువ్వునీ, ఒక మంటనీ, ఎన్నడో ఏమరిచిన మంచుదారిలో విడిచిన మౌన పాదముద్రనీ మరచినట్టు. . సారా టీజ్డేల్ (1884–1933) అమెరికను కవయిత్రి…