నెల: జనవరి 2017
-
కవి వీరుడు… కోర్సన్ మిల్లర్
అటు చూడండి! అతను నిష్క్రమించాడు; తారాకిరీటంతో, ఏ కన్నీరూ లేకుండా, తలలో వసివాడని కీర్తి కుసుమాలతో. మృత్యువు ముద్దాడింది; ఈ రాత్రి ప్రకృతిఎంతో అందంగా ఉంది కవులునిద్రించే, ప్రశాంతత రాజ్యమేలే పడమటి ద్వీపానికి అతను సరికొత్త అతిథి. నవయవ్వనుడైన కీట్స్ అతనిచెంతనే ఉన్నాడు. వెండి వెన్నెలబోలిన నీటిబుగ్గలు ఎగసిపడుతున్నాయి; భూమిమీది కవులకు ఒక శోకగీతం పాపం! వాళ్ళ నేత్రాలిపుడు చీకటితో మూయబడ్డాయి, వాళ్ళ పుట్టువు ఎటుచూసినా, బాధలనూ, క్లేశాన్నీ అగాధమైన నిస్పృహనీ భవిష్యవాణిగా సూచిస్తోంది. ఓ గులాబులారా!…
-
మిడుత… లెనోరా స్పేయ ర్అమెరికను కవయిత్రి
మిడుత దాపున ఉన్న ఏ చెట్టు మీంచో నీ వాడి గొంతు చురకేస్తుంది నీ వేగానికి గాలిలో నీ జాడలు సెగరేగుతూ ఉంటాయి సూర్యుడి నులివెచ్చనికిరణాలమీద సానపెట్టిన చిన్న శబ్ద తరంగం మండుతూ ప్రసరించినట్టు. . లెనోరా స్పేయర్ (7 November 1872 – 10 February 1956) అమెరికను కవయిత్రి The Locust Your hot voice sizzles from some cool tree nearby: You seem to burn your way through…
-
లాయర్లకి మరీ ఎక్కువ తెలుసు… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను
బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు. వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలు ఆపోసన పట్టిన వారు. వాళ్లకంతా తెలుసు, చచ్చినవాడు ఏమిటి రాసాడో, అందులోనూ, మృతుడి బిరుసెక్కిన చేతులు, కణుపులు పట్టుతప్పుతుంటే, చేతి వేళ్ళ ఎముకలు సున్నంలా రాలిపోతుంటే ఏం రాసారో. లాయర్లకి బాగా తెలుసు, చనిపోయినవాడి ఆలోచనలేమిటో. బేరసారాలు చేసే లాయర్ల అడుగు జాడల్లో, బాబ్! తప్పించుకుందికి అనువుగా మరీ ఎక్కువ “అనుమానా”లు, “ఐనప్పటికీ”లు, “ఇంతకుముందెన్నడూ”లు, “అలా అయితేనే”లు, “అలా కాకుండా”లు, చాలా ద్వారాలుంటాయి రావడానికైనా…
-
సాయంత్రవేళలో ఆ ఇల్లు… విలియం రోజ్ బెనెట్
ఈ కవిత చదవగానే నాకు James Hilton రాసిన Good Bye Mr. Chipps నవల గుర్తుకొచ్చింది. *** స్కూలు ఆటస్థలానికి అడ్డంగా మొదలవుతుందా ఇల్లు ఆ పసుపు పచ్చని దీపం… నా కంటి వెలుగు రగులుతున్న హృదయానికి కవాటము కలతపడ్డ కలలకి మార్గాంతరం స్వర్గానికి తిన్నగా తీసుకుపోయే నిచ్చెన ఎంతో మురిపెంతో ఊరటనిచ్చే ఆ గొంతు ఆ ప్రేమాస్పదమైన వెచ్చని చేతులు ఒకప్పుడు నా నిర్లక్ష్యానికి గురయ్యేయి. ఆ ఇల్లు అంతటి పవిత్రమైన…
-
ద్వారం… ఎలిజబెత్ జె కోట్స్ వర్త్, అమెరికను
మనిషి ఆశాజీవి. వర్తమానం ఎంత కష్టంగా గడుస్తున్నా, భవిష్యత్తు బాగుంటుందనే ఆశలేకపోతే, మనిషి బ్రతకలేడు. తన బలహీనతలు అర్థం చేసుకుని, వర్తమానంలో భవిష్యత్తుకోసం తగిన ప్రణాళికలు వేసుకోకుండా కూడా బ్రతకలేడు. ఈ చిన్న కవిత కష్టాల్లో ఒక రైతు ఇంటిపోరునీ, వర్షాభావాన్నీ, కవివాక్కులు తలుచుకుని తన జీవితానికీ రాజీ పడడాన్నీ కవయిత్రి ఎంతో అందంగా ఏ వ్యాఖ్యలూ లేకుండా చిత్రించింది. *** రోడ్డుమీద మందంగా దుమ్ము పేరుకుపోయింది పొలాలు ఎండకి మాడిపోతున్నాయి రోజుపని పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేక…
-
సివిల్ ఇంజనీర్లు… ఫీబీ హాఫ్ మన్, జర్మను-అమెరికను కవయిత్రి
వాళ్ళు ప్రకృతి కోటగోడలపై దాడి చేశారు మందుగుండు, రంధ్రాలువేసే యంత్రాలతో కదిలారు ఆమె కొండ బురుజులపైకి, చిత్తడి నేలల్లోకి ఆమె శక్తికి దీటుగా వాళ్ళ నైపుణ్యంతో. కొండగొర్రె కొమ్ములు మెలితిరిగినట్టు వాళ్ళ వంతెనలను ఎగసిపడే కెరటాలతో మెలితిప్పినా వాళ్ళ జలాశయాల దన్ను గోడలమీద ఆకలిగొన్న పులిలా ఆమె లంఘించినా వాళ్ళు బీవర్ (Beaver) కళను అనుకరిస్తూ అడ్డుగోడల్ని సాలెపురుగుల్లా అల్లేరు గుండెతడిలేని ఏడారిలో పూలు విరబూయించి ఎడారి నిద్రమత్తుని వదలగొట్టేరు ప్రకృతి హైమహస్తాల్లోంచి సొరంగాలు తవ్వో లేక…
-
పూదోట… రోజ్ పార్క్ వుడ్ అమెరికను
నీ పిల్లలిద్దరు ఒక వేసవి పొద్దు వాళ్ళ తోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు నిన్నటి కలుపుమొక్కలను తీశారు, వాళ్ళకి నీ అందమైన చిరునవ్వు ప్రసాదించేవు. నీ బిడ్డలిద్దరు ఎండలో వాళ్ళతోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు నాగలి తో తిన్నని చాళ్ళు వేశారు, నువ్వొక రాగరంజితమైన నవ్వుని ప్రసాదించేవు నీ పిల్లలిద్దరు విసురుగాలి రోజున తమతోటలో పనిచేశారు ప్రభూ! వాళ్ళు రేగడిమట్టిలోని పెల్లల్ని పగలగొట్టేరు, తేజోభరితమైన నీ నేత్రాలు మూసుకున్నావు. నీ బిడ్డలిద్దరు మేఘావృతమైన రోజు తమతోటలో పనిచేశారు ప్రభూ!…
-
మంచు తుఫాను… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను
విలియం కార్లోస్ విలియమ్స్ ప్రతీకాత్మక కవిత్వానికి ప్రసిద్ధివహించినవాడు. కనుక ఇక్కడ మంచుతుఫాను ఒక ప్రతీక మాత్రమే. “ఏళ్ళతరబడి నిగ్రహించిన” అన్నమాటను బట్టి, అది ధర్మాగ్రహం కావొచ్చు. ధర్మాగ్రహం అణచుకున్నంతసేపూ ఫర్వాలేదు గాని, ఒక సారి ప్రదర్శితమైతే, దాని పర్యవసానం వినాశం కావొచ్చు. అప్పుడు మిగిలిన శిధిలాల్లోంచి మనిషి ఒంటరి ప్రయాణం చెయ్యవలసిందే. “వెలుగునీడల హేల” ఆశనిరాశల మానసిక స్థితి. * మంచు: ఏళ్ళతరబడి నిగ్రహించుకున్న ఆగ్రహం గంటలతరబడి తీరుబాటుగా కురుస్తుంది ఈ మంచుతుఫాను దాని ప్రభావం…
-
శాపం… ఎలిజబెత్ జె. కోట్స్ వర్త్, అమెరికను
ఈ కవిత సుమారు 100 సంవత్సరాల క్రింద ప్రచురించబడిందంటే, అందులోనూ ఒక ఇంగ్లీషు పత్రికలో, ఆశ్చర్యంవేస్తుంది. దేశాకాలావధులు లేకుండా నవవధువుల జీవితాలు ఎలా ఆదిలోనే తృంచబడుతున్నాయో చెప్పేహృదయ విదారకమైన కవిత. ఇది డిశంబరు 1919లో Poetry అన్న పత్రికలో అచ్చయింది. * తాడుకి వేలాడుతోంది మా చెల్లెలు ఉరేసుకుని చక్కని ఆమె పాదాలు లిల్లీపువ్వుల్లా ఉంటాయి. మా ఇంటి సుగంధపుష్పాన్ని వాళ్ళు నలిపేసేరు వాళ్ళని ఆమె తగినట్టుగా శపిస్తుంది లెండి. ఆమె చేతిలో ఉన్న చీపురును తీసుకొండి, ఆమె నిలబడగలిగేలా…
-
గడ్డకట్టే చలికాలంలో… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! మనిద్దరం రెండు పువ్వులాంటి వాళ్ళం వాడిపోతున్న తోటలో చివరగా పూచిన వాళ్ళం, ఊదారంగు పొద్దుతిరుగుడుపువ్వొకటీ, ఎర్రదొకటీ ఒంటరిగా నిస్సహాయంగా పాడుబడిన ప్రకృతిలో. తోటలోని చెట్లన్నీ వయసుడిగి, ఆకులురాలుస్తున్నాయి. ఒక బిరుసైన ఆకు మరో ఆకుతో రాసుకుంటోంది. నినదిస్తున్న రాలుతున్న పూరేకుల సవ్వడి ఇక నువ్వూ నేనే తలూచుకుంటూ మిగిలాం. ఒకప్పుడు మనతో చాలామంది ఉండేవారు; అందరూ వాడిపోయేరు. మనిద్దరమే ఎర్రగానూ, బచ్చలిపండు రంగులోనూ మిగిలున్నాం. మనిద్దరమే మంచుకురవని సుప్రభాతాలలో సూర్యుడు పైకెదుగుతుంటే, రంగుతో కళకళలాడుతున్నాం. పాలిపోయిన…