మతసామరస్యం … జాతిపిత మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ 69 వ వర్థంతి సందర్భంగా

మతసామరస్యం అవసరమన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ అందరికీ, మతసామరస్యం అంటే బలవంతంగా విధించగలిగిన రాజకీయ ఐక్యత కాదన్న విషయంమాత్రం తెలియదు. మతసామరస్యం అన్నది ఎవ్వరూ వేరుపరచలేని మనసుల కలయిక. అది సాధించడానికి ముందుగా ప్రతి కాంగ్రెసు వాదీ అనుసరించవలసింది, అతను ఏ మతానికి చెందినవాడైనప్పటికీ, తను హిందూ, ముస్లిం, క్రిస్టియం జొరాష్ట్రియన్, యూదు మొదలైన మతాలన్నిటికీ ప్రతినిథిగా ప్రవర్తించాలి. క్లుప్తంగా చెప్పాలంటే అతను హిందూ, హిందూ ఏతర మతాలన్నిటికీ ప్రతినిథిగా ఉండాలి. ఈ హిందూ దేశంలో నివసిస్తున్న అన్నికోట్ల మతావలంబులతో తనని తాను గుర్తించుకోగలగాలి. ఇది సాధించాలంటే, ప్రతి కాంగ్రెసువాదీ, తన మతం కాకుండా తక్కిన మతావలంబులతో వ్యక్తిగత స్నేహాన్ని పెంపొందించుకోవాలి. తన మతం పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో, తక్కిన మతాలపట్లకూడా అంత గౌరవాన్నీ కలిగిఉండాలి.

అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, రైల్వే స్టేషన్లలో “హిందూ త్రాగు నీరు” అనీ, “ముస్లిం త్రాగు నీరు” అనీ, లేదా, “హిందూ టీ” అనీ, “ముస్లిం టీ” అన్ని అవమానకరమైన అరుపులు వినిపించవు. పాఠశాలల్లో, కళాశాలల్లో, హిందువులకీ, హిందూ ఏతరులకి వేర్వేరు గదులూ, వేర్వేరు పాత్రలూ కనిపించవు. ఒక్కొక్క మతానికీ వేర్వేరు పాఠశాలలూ, కళాశాలలూ, ఆసుపత్రులూ ఉండవు. అటువంటి విప్లవాన్ని తీసుకురావడానికి ప్రతి కాంగ్రెసువాదీ ఏ రకమైన రాజకీయ లబ్దీ పొందాలన్న తలంపు లేకుండా దాన్ని సరిదిద్దడానికి పూనుకోవాలి. దాని పర్యవసానంగా, రాజకీయ ఐక్యత దానంతట అదే సిద్ధిస్తుంది.

ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సిద్ధిస్తుందన్న అపోహలో చిరకాలంనుండీ ఉన్నాము. ఈ రకమైన నమ్మకానికి మన అజ్ఞానమూ, మన జడత్వమూ ముఖ్య కారణమని నా నమ్మకం. బ్రిటిషు చరిత్రని పైపైని చదివి ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సంక్రమిస్తుందని అనుకుంటున్నాము. నిజం ఏమిటంటే, ప్రజలకి ఆ అధికారం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ వాళ్లు ఎన్నుకున్న ప్రతినిధులకు తాత్కాలికంగా అది అందివ్వబడుతుంది. ప్రజలు అందించిన అధికారం కాకుండా, చట్టసభలకు స్వతంత్రంగా ఏ అస్తిత్వంగాని, అధికారాలు గాని లేవు. ఈ ప్రాథమిక సత్యాన్ని ప్రజలకి తెలియపరచడానికి గత 21 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. శాసనోల్లంఘన అధికారానికి కాణాచి. మొత్తం దేశప్రజలందరూ చట్టసభలు చేసే శాసనాన్ని ధిక్కరించి దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని ఒక్క సారి ఊహించుకొండి. వాళ్ళు ఈ చట్టసభలనీ, అధికార యంత్రాంగాన్నీ ఒక్కసారిగా నిర్వీర్యం చేస్తారు! పోలీసులూ, సైన్యమూ వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ, కేవలం అల్పసంఖ్యాకులపై మాత్రమే వాళ్ళ ప్రతాపం చూపగలరు. కానీ, దేనికైనా తెగించి ముందుకువచ్చిన దేశప్రజలు యావన్మందినీ ఏ పోలీసులూ, సైన్యమూ ఏమీ చెయ్యలేరు.

చట్టసభల ద్వారా రాజ్యాన్ని పరిపాలించడం చట్టసభలలకి వెళ్ళిన ప్రతినిధులు అధికసంఖ్యాకులైన ప్రజల అభిప్రాయానికి తల ఒగ్గి నడుచుకుందికి ప్రయత్నించినపుడు మాత్రమే సరిగా జరుగుతుంది. మరొక మాటలో చెప్పాలంటే, ప్రజాభిప్రాయమూ, చట్టసభల అభిప్రాయమూ ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నప్పుడే రాజ్యనిర్వహణ సాధ్యపడుతుంది.

భారతదేశంలో మనం పార్లమెంటరీ వ్యవస్థని రెండు భిన్నమైన నియోజకవర్గాలద్వారా సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తున్నాము గానీ అలా చెయ్యడం ద్వారా పరస్పరం పొసగని స్థితిని సృష్టిస్తున్నాము. ఒకే వేదికమీదకి ఈ రెండు కృత్రిమమైన వ్యవస్థలనూ తీసుకురావడం ద్వారా మనం ఆచరణలో ఐకమత్యాన్ని తీసుకురాలేము. అటువంటి చట్టసభలు పనిచేస్తే చెయ్యవచ్చు. కానీ, ఈ వేదికలు తగువులాడుకుందికీ, అధికారంలో ఎవరున్నప్పటికీ, వాళ్ళ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి, వాళ్ళు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడేవారికి మాత్రమే పనికి వస్తాయి. అవి ఇనప రూళకర్రతో బెదిరించి పాలించడానికీ, వ్యతిరేకించే వర్గాలు ఒకరిమీద ఒకరు కత్తులుదూసుకోకుండా నిరోధించడానికీ పనికొస్తాయి. అటువంటి అవమానకరమైన పరిస్థితులలో పూర్ణ స్వరాజ్యం సాధించడం అసంభవమని నా వ్యక్తిగత అభిప్రాయం.

నాకు అటువంటి స్పష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నప్పటికీ, చట్టసభలకి ఎన్నుకోడానికి “అయోగ్యులైన అభ్యర్థులు” లేనంతవరకూ, విప్లవకారులు చట్టసభలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కాంగ్రెసు తన అభ్యర్థుల్ని నిలబెట్టాలన్న నిశ్చయానికి వచ్చేను.
.
MK గాంధీ

portrait_gandhi

On the eve of  69th  Anniversary of  Bapu’s Assassination

.

Communal Unity

Everybody is agreed about the necessity of this unity. But everybody does not know that unity does not mean political unity which may be imposed. It means an unbreakable heart unity. The first thing essential for achieving such unity is for every congressman, whatever his religion may be, to represent his own person Hindu, Muslim, Christian, Zoroastrian, Jew, etc., shortly, every  Hindu and No-Hindu. He has to feel his identity with every one of the millions of the inhabitants of Hindustan. In order to realize this, every Congressman will cultivate personal friendship with persons representing faiths other than his own. He should have the same regard for the other faiths as he has for his own.

In such a happy state of things there would be no disgraceful cry at the stations such as “Hindu Water” and “Muslim Water” or “Hindu Tea” and “Muslim Tea”.  There would be no separate rooms or pots for Hindus and non-Hindus in schools and colleges, no communal schools, colleges and hospitals. The beginning of such a revolution has to be made by Congressmen without any political motive behind the correct conduct. Political unity will be its natural fruit.

We have long been accustomed to think that power comes only through Legislative Assemblies.  I have regarded this belief as a grave error brought about by inertia or hypnotism. A superficial study of British history has made us think that all power percolates to the people from parliaments. The truth is that power resides in the people and it is entrusted for the time being to those whom they may choose as representatives. Parliaments have no power or even existence independently of people. It has been my effort for the last twenty-one years to convince the people of this simple truth. Civil Disobedience is the storehouse of power. Imagine a whole people unwilling to conform to the laws of the legislature, and prepared to suffer the consequences on non-compliance! They will bring the whole legislative and executive machinery to a standstill.  The police and military are of use to coerce minorities however powerful they may be. But no police or military coercion can bend the resolute will of people who are out for suffering to the uttermost.

And the parliamentary procedure is good only when its members are willing to conform to the will of the majority. In other words, it is fairly effective only among compatibles.

Here in India we have been pretending to work the parliamentary system under separate electorates which have created artificial incompatibles. Living unity can never come out of these artificial entities being brought together on a common platform. Such legislatures may function. But they can only be a platform for wrangling and sharing the crumbs of power that may fall from rulers whoever they may be. These rule with rod of iron, and prevent the opposing elements from flying at one another’s throats. I hold the emergence of complete Independence to be an impossibility out of such a disgrace.

Though I hold such strong views, I have come to the conclusion that so long as there are  undesirable candidates for elective bodies, Congress should put up candidates in order to prevent reactionaries from entering such bodies.

MK Gandhi

PPs 8-9, Constructive Programme, Its meaning and Place. Navajivan Publishing House, Ahmedabad December 1945 (Courtesy: Gandhi Heritage Portal)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: