చివరికి అంతా ఇంతేనా?… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను చివరికి అంతా ఇంతేనా? ఇక ఈ ద్వారాలు ఎన్నటికీ తెరుచుకోవా? తుప్పుపట్టిన తలుపుకమ్ములచుట్టూ ధూళీ- గాలీ దొంగాటాడుతూ, శరద్గీతికలు నిట్టూర్పులు విడువవలసినదేనా? నువ్వు పర్వతాలను వీక్షిస్తుంటావు పర్వతాలు నిన్ను చూస్తుంటాయి నువ్వు “నేను మహాపర్వతాన్నైతే బాగుండును” అనుకుంటావు మహా పర్వతం ఏమీ ఊహించుకోదు చివరకి ఇంతేనా? ఈ ద్వారాలు ఎన్నటికీ- ఎప్పటికీ తెరుచుకోవా? అంతా దుమ్మూ, గాలీ తుప్పుపట్టిన తలుపు కమ్ములూ ఓహ్, ఓహ్ అంటూ ఎండుటాకుల్లో నిట్టూర్పులు విడిచే శరద్గీతికలూ, అంతేనా? గాలిలో శోకగీతికలు తప్ప మరొకటి వినిపించవా? గాయకులు కనిపించరా? పాటలను ఆలపించే పెదాలు కనిపించవా? హృదయం గాయపడిన స్త్రీ ఇలా నీకు చెబుతోందని చెబుతున్నావా? చివరకి అంతా ఇంతేనా? . కార్ల్ సాండ్ బర్గ్ January 6, 1878 – July 22, 1967 అమెరికను కవి . And this will be all? . And this will be all? And the gates will never open again? And the dust and the wind will play around the rusty door hinges and the songs of October moan, Why-oh, why-oh? And you will look to the mountains And the mountains will look to you And you will wish you were a mountain And the mountain will wish nothing at all? This will be all? The gates will never-never open again? The dust and the wind only And the rusty door hinges and moaning October And Why-oh, why-oh, in the moaning dry leaves, This will be all? Nothing in the air but songs And no singers, no mouths to know the songs? You tell us a woman with a heartache tells you it is so? This will be all? . Carl Sandburg American Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 28, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుAmericanCarl Sandburg బహిష్కరణ… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రిA Letter To Mother… Manasa Yendluri, Telugu, Indian స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.