రోజు: జనవరి 25, 2017
-
పిల్లులకి పిండంబెట్ట!… పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియా
(ఇది చాలా అపురూపమైన కవిత. మనకి కొందరు వ్యక్తులపట్ల, కొన్ని జాతులూ, మతాలపట్లా నిష్కారణమైన ద్వేషం ఉంటుంది. ముందు మనం వాటిని ద్వేషించడం ప్రారంభిస్తాం గనుక ద్వేషించడానికి తగిన కారణాలు ఎంత అల్పమైనవైనా, అర్థంలేనివైనా వెతుక్కోజూస్తాం. ప్రభుత్వాలైనా అంతే. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసేది ప్రతీదీ తప్పు అనడం తప్ప ప్రభుత్వనిర్ణయాలను దేశప్రయోజనాల దృష్టిలో వివేచించే ప్రసక్తి ఉండదు. ఎదుటవ్యక్తిమీద మనతీర్పులన్నీ అతనిచర్యలవల్ల మనకి కలిగే లాభనష్టాలమీద ఆధారపడి ఉంటాయి తప్ప, ఎదుటివ్యక్తికి మనం కోరుకున్నట్టుగానే, అతనికి…