రోజు: జనవరి 19, 2017
-
కొండ శిఖరం … సారా టీజ్డేల్, అమెరికను
బహుశా ఇందాకనే ఈ కొండ శిఖరాన్ని దాటి ఉంటాను ఇప్పుడు నేను కొండదిగుతున్నట్టు తెలుస్తోంది. చిత్రం, కొండ శిఖరాన్ని అధిరోహించినా తెలుసుకోలేకపోవడం ఈ ముళ్ళకంపలు నా చీరకుచ్చెళ్ళకు అస్తమానం తగులుకుంటున్నాయి. పొద్దున్నల్లా ఊహించుకుంటూనే ఉన్నాను కొండశిఖరాన్నెక్కి గాలీ వెల్తురూ నన్ను చుట్టుముట్టి, ప్రపంచం నా పాదాలక్రింద ఉంటుంటే మహారాణిలా అక్కడ గర్వంగా నిటారుగా నిలుచుంటే ఎంతబాగుంటుందోనని… కానీ అసలు గాలే లేదు, ఇక్కడ చూడగలిగిందీ ఏమీ లేదు. అందరూ నడిచిన ఈ బాట చదునుగా ఉంది ముళ్ళకంపలు…