సాయంత్రవేళలో ఆ ఇల్లు… విలియం రోజ్ బెనెట్

ఈ కవిత చదవగానే నాకు  James Hilton  రాసిన Good Bye Mr. Chipps నవల గుర్తుకొచ్చింది.

***

 

 

స్కూలు ఆటస్థలానికి అడ్డంగా మొదలవుతుందా ఇల్లు
ఆ పసుపు పచ్చని దీపం… నా కంటి వెలుగు
రగులుతున్న హృదయానికి కవాటము
కలతపడ్డ కలలకి మార్గాంతరం
స్వర్గానికి తిన్నగా తీసుకుపోయే నిచ్చెన
ఎంతో మురిపెంతో ఊరటనిచ్చే ఆ గొంతు
ఆ ప్రేమాస్పదమైన వెచ్చని చేతులు
ఒకప్పుడు నా నిర్లక్ష్యానికి గురయ్యేయి.

ఆ ఇల్లు అంతటి పవిత్రమైన ప్రసాదాలతో
నిండి ఉంటుందని మీరెన్నడూ ఊహించలేరు.
విశృంఖలంగా చరించేవాడికి మద్యం, మాంసం ప్రసాదిస్తుందనీ
తుఫానులో కొట్టుమిట్టాడే ఆత్మకి తట్టుకోగల రెక్కలిస్తుందనీ
ఆనందాన్ని నింపడానికి చిన్ని పలుకులు మ్రోయిస్తుందనీ
రేయిని తారకా,కుసుమాలతో అభిషిక్తం చేస్తుందనీ
భ్రమణశీలమైన ఈ జగతిపై
అంత ప్రశాంతంగా సమయం గడుస్తుందనీ ఊహించలేరు.

అయినా, ఇంత తుఫానులోనూ భద్రంగా ఉంది
శీతకాలంలో వెచ్చని ప్రేమను పంచింది
దాని సరిపోలిన ఇల్లు మనుషులు జ్ఞాపకాలు
మరిచిపోగలిగేదాకా నిలిచి ఉండగలదా?
అందులో ఇద్దర్ని అదృష్టం అందుకోలేదు
వారి పేర్ల చుట్టూ ఇతిహాసాన్ని రచిస్తూ
మామూలుగా మాటాడుకునే మాటల్లో సైతం
నిరాశపోగొట్టి ఆశని నింపుతున్నాది.
.

విలియం రోజ్ బెనెట్

(February 2, 1886 – May 4, 1950)

అమెరికను కవి

.

The House at Evening

.

(In Memory of T. F. B.*)

.

Across the school-ground it would start

To light my eyes, that yellow gleam—

The window of the flaming heart,

The chimney of the tossing dream.

The scuffed and wooden porch of Heaven,

The voice that came like a caress,

The warm kind hands that once were given

My carelessness.

It was a house you would not think

Could hold such sacraments in things

Or give the wild heart meat and drink

Or give the stormy soul high wings

Or chime small voices to such mirth

Or crown the night with stars and flowers

Or make upon this quaking earth

Such steady hours.

Yet, that in storm it stood secure,

And in the cold was warm with love,

Shall its similitude endure

Past trophies that men weary of,

Where two were out of fortune’s reach,

Building great empires round a name

And ushering into casual speech

Dim worlds aflame.

.

William Rose Benét

(February 2, 1886 – May 4, 1950)

1941 Pulitzer Prize for “The Dust Which Is God”

*( His first wife Teresa France Benét?)

Poem Courtesy:

http://www.bartleby.com/273/108.html

 

The Yale Review, October 1919

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: