పూదోట… రోజ్ పార్క్ వుడ్ అమెరికను

నీ పిల్లలిద్దరు ఒక వేసవి పొద్దు వాళ్ళ తోటలో పనిచేశారు ప్రభూ!
వాళ్ళు నిన్నటి కలుపుమొక్కలను తీశారు, వాళ్ళకి నీ అందమైన చిరునవ్వు ప్రసాదించేవు.
నీ బిడ్డలిద్దరు ఎండలో వాళ్ళతోటలో పనిచేశారు ప్రభూ!
వాళ్ళు నాగలి తో తిన్నని చాళ్ళు వేశారు, నువ్వొక రాగరంజితమైన నవ్వుని ప్రసాదించేవు
నీ పిల్లలిద్దరు విసురుగాలి రోజున తమతోటలో పనిచేశారు ప్రభూ!
వాళ్ళు రేగడిమట్టిలోని పెల్లల్ని పగలగొట్టేరు, తేజోభరితమైన నీ నేత్రాలు మూసుకున్నావు.
నీ బిడ్డలిద్దరు మేఘావృతమైన రోజు తమతోటలో పనిచేశారు ప్రభూ!
వాళ్ళు ఆడుతూపాడుతూ విత్తనాలు చాళ్ళలో వేశారు, నువ్వు సాంత్వననిచ్చే అశ్రువుని రాల్చేవు.
నీ పిల్లలిద్దరు వర్షంరోజున తోటలోంచి ఇంటికి మరలేరు ప్రభూ!
నీ నవ్వూ, నీ నిట్టూర్పూ, నీ అశ్రువూ వాళ్ళ గుండెలో చేరాయి.
నీ బిడ్డలిద్దరూ ఇక జీవితకాలం నీ తోటలో పని చేస్తారు ప్రభూ!

.

 రోజ్ పార్క్ వుడ్

అమెరికను

.

The Garden

.

Two of Thy children one summer day worked in their garden, Lord;

They chopped the weeds of yesterday and you sent down a golden smile.

Two of Thy children one sunny day worked in their garden, Lord,

They hoed the furrow straight for the earthy bed and you whispered a singing smile.

Two of Thy children one windy day worked in their garden, Lord;

They pressed out the lumps from the clayey soil and you closed your shining eyes;

Two of Thy children one cloudy day worked in their garden, Lord,

They dropped in the seeds with a song in their hearts and you sent a soothing tear.

Two of Thy children one rainy day turned from their garden, Lord—

Your Smile and your Sigh and your Tear entered into their hearts.

Two of Thy children, all the days of their life will work in Thy garden, Lord!

.

Rose Parkewood

Poem Courtesy:

http://www.bartleby.com/273/21.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: