మంచు తుఫాను… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను

విలియం కార్లోస్ విలియమ్స్ ప్రతీకాత్మక కవిత్వానికి ప్రసిద్ధివహించినవాడు. కనుక ఇక్కడ మంచుతుఫాను ఒక ప్రతీక మాత్రమే. “ఏళ్ళతరబడి నిగ్రహించిన” అన్నమాటను బట్టి, అది ధర్మాగ్రహం కావొచ్చు. ధర్మాగ్రహం అణచుకున్నంతసేపూ ఫర్వాలేదు గాని, ఒక సారి ప్రదర్శితమైతే, దాని పర్యవసానం  వినాశం కావొచ్చు. అప్పుడు మిగిలిన శిధిలాల్లోంచి మనిషి ఒంటరి ప్రయాణం చెయ్యవలసిందే.   “వెలుగునీడల హేల”  ఆశనిరాశల మానసిక స్థితి.

*

మంచు:
ఏళ్ళతరబడి నిగ్రహించుకున్న ఆగ్రహం
గంటలతరబడి తీరుబాటుగా కురుస్తుంది
ఈ మంచుతుఫాను
దాని ప్రభావం అలా ఎక్కడెక్కడికో
లోపల్లోపలికి మూడురోజులపాటో
అరవై ఏళ్ళపాటో, ఎవరికెరుక? తర్వాత
ఎండ! పసుపూ నలుపూ కలగలిసి
తెరలు తెరలుగా వెలుగునీడల హేల…
కనుచూపుమేర వ్యాపించిన నిర్జన నిరామయంలో
నిడుపైన వీధుల్లో భయపెడుతూ
ఎత్తుగా నిలుచుని సన్నని చెట్లు.
అదిగో మనిషి మళ్ళీ ప్రత్యక్షం
ఈ విశ్వరాదారిమీద
పరుచుకుంటూ అతని ఒంటరి కాలిబాట.
.
విలియం కార్లోస్ విలియమ్స్

(September 17, 1883 – March 4, 1963)

అమెరికను.

.

.

Blizzard

.

Snow:

Years of anger following

Hours that float idly down —

The blizzard

Drifts its weight

Deeper and deeper for three days

Or sixty years, eh? Then

The sun! a clutter of

Yellow and blue flakes —

Hairy looking trees stand out

In long alleys

Over a wild solitude.

The man turns and there —

His solitary track stretched out

Upon the world.

.

William Carlos Williams

(September 17, 1883 – March 4, 1963)

American

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: