ఈ కవిత సుమారు 100 సంవత్సరాల క్రింద ప్రచురించబడిందంటే, అందులోనూ ఒక ఇంగ్లీషు పత్రికలో, ఆశ్చర్యంవేస్తుంది. దేశాకాలావధులు లేకుండా నవవధువుల జీవితాలు ఎలా ఆదిలోనే తృంచబడుతున్నాయో చెప్పేహృదయ విదారకమైన కవిత. ఇది డిశంబరు 1919లో Poetry అన్న పత్రికలో అచ్చయింది.
*
తాడుకి వేలాడుతోంది మా చెల్లెలు ఉరేసుకుని
చక్కని ఆమె పాదాలు లిల్లీపువ్వుల్లా ఉంటాయి.
మా ఇంటి సుగంధపుష్పాన్ని వాళ్ళు నలిపేసేరు
వాళ్ళని ఆమె తగినట్టుగా శపిస్తుంది లెండి.
ఆమె చేతిలో ఉన్న చీపురును తీసుకొండి,
ఆమె నిలబడగలిగేలా ఎత్తిపట్టుకొండి
నాలుగుపక్కలా ఈ గదిని తుడవండి
ఈ ఇంటికి ఇల్లాలుగా వచ్చిన మా చెల్లెలు
సంపదనీ, ఆరోగ్యాన్నీ, చిరాయువునీ
కసితో ఈ ఇంట్లోంచి తుడిచిపెట్టుగాక.
అటూ ఇటూ, నాలుగుపక్కలా తుడవండి.
ఎటుచూసినా వినాశమే, వీళ్ళకి వినాశమే.
ఈ నవవధువుని దేముడు కరుణిస్తాడు
దేవతలు వీళ్ళని తప్పక శపిస్తారు.
ఆమె విరబూసిన చెట్టులా ఉండేది
ఆమె వసంతంలోనే నేలపాలైంది.
ఆమె చేతిలోని చీపురు పట్టుకొండి
ఆమె నిలబడగలిగేదాకా ఎత్తి పట్టుకొండి.
ఆమెకి పువ్వులంటే గొప్ప ఇష్టం; ఎప్పుడూ
నవ్వుతూ ఉండే ఆమె మనసును గాయపడేదాకా.
ఇక ఈ ఇంట్లో ఆమె ఉండడానికి వీల్లేదు.
ఆమెను ఎత్తిపట్టుకొండి- లెండి, మనం బయలుదేరుదాం.
.
ఎలిజబెత్ జె. కోట్స్ వర్త్
(May 31, 1893 – August 31, 1986)
అమెరికను కవయిత్రి
.
.
The Curse
.
Om the cord dead hangs our sister,
She of the wondrous lily feet.
They have blasted our fragrant flower—
She shall curse them as is meet!
Hold the broom in her dead hand—
Raise her up until she stand.
Backward, forward, sweep the room!
Wealth and happiness and long life
Sweeps she with avenging broom
From the house where she was wife.
Backward, forward, sweep the broom
Sweeping doom, sweeping doom!
Now the gods will surely punish—
Surely pity the young bride.
She was like a willow blossom,
It was springtime when she died.
Hold the broom in her dead hand—
Raise her up until she stand!
She was always flower-gay
Till they broke her smiling heart.
In this house she would not stay—
Take her up—let us depart.
.
Elizabeth J. Coatsworth
(May 31, 1893 – August 31, 1986)
American
Poem Courtesy:
http://www.bartleby.com/273/111.html
Poetry, a Magazine of Verse, December 1919
స్పందించండి