వ్యవసాయదారులు… విలియం అలెగ్జాండర్ పెర్సీ, అమెరికను
నేను రైతుల్ని వాళ్ళపొలాల్లో గమనిస్తూ
నాలో నేను ఆశ్చర్యపోతుంటాను.
వాళ్ళు ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా ఉంటారు
వాళ్ళలో ఎంతో హుందాతనం ఉంటుంది.
అంత చిన్నవిషయాలూ ఎంతోబాగా తెలుసు వాళ్ళకి
వాళ్ళు పెద్దగా చదువుకోనప్పటికీ.
కొందరికి ఏమీ దొరకని చోట
వాళ్ళు నిలకడగా పంటపండించగలరు.
దేవునితో వాళ్ళు పడే తగవులన్నీ
త్వరలోనే సర్దుబాటు చేసుకుంటారు.
వాళ్ళతనికి క్షమాభిక్షపెడతారు
వెండివెలుగుల వానజల్లు ఆలస్యంగా కురిసినా.
పంటదిగుబడి తగ్గినపుడు వాళ్ళ వినోదాలు
నిండుకుని, బాధలు ముంచెత్తుతాయి
అందరికీ తెలిసిందే, వాళ్ళు దేమునిమీద
భారం వేసే వ్యవసాయం చేస్తారని.
అలాంటపుడు, పొలాలు అమ్మకానికున్నపుడు
చిన్నకమతాలు కౌలుకి దొరుకుతున్నపుడు
ఎందుకింకా నేను తెలివితక్కువగా, నా
జ్ఞానాన్నీ, అసంతృప్తినీ నమ్ముకుంటున్నాను?
.
విలియం అలెగ్జాండర్ పెర్సీ
(May 14, 1885 – January 21, 1942)
అమెరికను

.
Farmers
.
I watch the farmers in their fields
And marvel secretly.
They are so very calm and sure,
They have such dignity.
They know such simple things so well,
Although their learning’s small,
They find a steady, brown content
Where some find none at all.
And all their quarrelings with God
Are soon made up again;
They grant forgiveness when He sends
His silver, tardy rain.
Their pleasure is so grave and full
When gathered crops are trim,
You know they think their work was done
In partnership with Him.
Then, why, when there are fields to buy,
And little fields to rent,
Do I still love so foolishly
Wisdom and discontent?
.
William Alexander Percy
(May 14, 1885 – January 21, 1942)
American
Contemporary Verse
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి