ప్రకృతి ఆరాధకుడు మరణించేడు… డేనియల్ హెండర్సన్, అమెరికను
(ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని తెగలలో ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయినపుడు తేనెటీగలకి ఆ వార్త చెప్పే సంప్రదాయం ఉంది)
***
తేనీగలారా! వెళ్ళండి అతని ఆస్తులు వివరించండి:
ఓక్ చెట్టూ, పచ్చికా, పూలచెట్లూ…
అతని జీవితాన్ని అంచనా వేసినా
అతను వాటితోనే ఉన్నాడని చెప్పండి.
అడవి పూలకీ, సుగంధభరితమైన గడ్డికీ
భూమి అతన్ని తర్జుమా చేసిందని చెప్పండి.
గలగలపారుతూ వంపులుతిరిగే వాగుకి చెప్పండి
దాని కలలు అతను పంచుకునేవాడని.
వేసవిలో విరిసే అడవులతో గుసగుసలాడండి
వాటి మానసికస్థితో మమేకమయేవాడని.
అల్లరిచిల్లరిగా తిరిగే చిరుగాలికి చెప్పండి
అదెటు తిరిగితే అటే అతని మనసూ పరిగెడుతుందని.
అతని హృదయ పారవశ్యంలోంచే తన
కళకు ప్రేరణ తెచ్చుకుందని కోయిలకు చెప్పండి.
తేనీగలారా! అతని చలువపందిరికిందకి తెండి
ప్రపంచంలో జరిగే మంచి మంచి ఊసులన్నీ;
పక్షులూ, పూలూ, చిరుజంతువుల గాథలన్నీ;
ప్రాణాన్ని తిరగదోడుతాయి; రెక్కలు కదుల్తాయి.
మనం అతనికిపుడు ఏ సేవ చెయ్యనక్కరలేదు.
తను ప్రేమించిన ప్రకృతిని స్నేహంగా ఉండమని కోరండి.
.
డేనియల్ హెండర్సన్
అమెరికను
.
A Nature-Lover Passes
.
(In certain parts of the World the custom still prevails of telling the bees that a member of the family has died.)