ఆమె చెప్పిన విధానం చూస్తే,
(చెప్పినదాన్లో చాలవరకు నిజం),
ఆమెకి ఇవ్వ వలసిన గౌరవాన్ని
ఏ అహంకారమూ ఆపలేదు:
ఆమె సులభంగా వంచించొచ్చు,
కానీ ఆ పని ఆమె చెయ్యలేదు,
అలా చేసుంటే పురుషుడు చిరునవ్వు నవ్వి
మోసాన్ని అర్థం చేసుకునే వాడు.
ఆమె అనుకున్నదానికంటే
ఎక్కువ ఊహిస్తే, అన్నిటికీ
ముగింపు పలకవస్తుందని తెలిసి
అతను ఆగేడు; అతను వెళ్ళినపుడు
ఉల్లాసమైన మాటతో వీడ్కోలు పలికేడు
ఆ మాట అతనికి చుక్కలు మినుకుమినుకుమన్న
రాత్రులలో అతను విన్న ఏ స్వరం కన్నా
చాలా తేలికగా అనిపించింది.
ఆమె సన్నగా నవ్వింది. అతను
ఆ చీకటిలో ఆమెచుట్టూ
శిధిలమైన పగటిగురించి
మాటైనా మాటాడడని తెలిసి.
అతనికెక్కడా శిధిలాలూ కనిపించలేదు
ఒంటరిగా ఆ చుక్కలక్రింద
తిరుగాడిన వారికెవరికీ ఎక్కడా
గాయాలున్నట్టూ అనిపించలేదు
.
ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్
(December 22, 1869 – April 6, 1935)
అమెరికను కవి
స్పందించండి