నాకు వనాలలోకి పోవాలంటే భయం
చెట్లన్నా, వాటి పచ్చని ఉన్మత్త ప్రాకారాలన్నా భయం.
నా చొక్కా చేతులు లాగే చిరుగాలులన్నా భయం
ఆకులగుబురులక్రింద ప్రాకే ‘ఆర్బ్యుటస్ ‘ లతలన్నా భయం.
ఇచ్చవచ్చినట్టు తడిమాటలతో వెక్కిరించే సెలయేరన్నా భయం
నేను పక్షుల కిలకిలారావాలు వింటే తడబడి పడిపోతుంటాను.
అకస్మాత్తుగా వచ్చే ఆ చిరుజల్లుల సంగతి చెప్పక్కరలేదు
విప్పారిన ఎర్రని కళ్ళతోభయపెట్టే పువ్వుల సంగతి చెప్పనక్కరలేదు.
ఆ చిన్ని కీటకాలు ఒక్కసారి విచ్చుకున్న రెక్కలతో
అవి నా చుట్టూ గోలచేస్తూ, నన్ను తాకి, పరిగెత్తుతుంటాయి
నా హృదయాన్ని వేధించడానికన్నట్టు ‘లైలాక్’ లు ఎదురుచూస్తుంటాయి.
ఓ హేమంతమా! దయతో నీ చల్లని మంచులో నను దాచు.
నేను భీరువుని, పిరికిదాన్ని, నాకు తెలుసు.
.
లెనోరా స్పేయర్
(7 November 1872 – 10 February 1956)
అమెరికను కవయిత్రి
స్పందించండి