పోలికలు… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి నా ముఖంలో ఎంతవెదికినా నీకున్న దేవరాజ్ఞి ముఖం పోలికలు లేవు నా శరీరంలో ఎక్కడా నీకున్న లావణ్యం మచ్చుకి కనరాదు. ఏ దేవమాయో నను తారుమారుచేసుండొచ్చు బహుశా నేను కొడుకునయినా అయి ఉండొచ్చు కానీ, నేను నీకూతురులా పెరిగి నలుగురిలో ఒకతెగా కనిపించడానికి. నీ రొమ్ములు రెండూ విడివడేచోట ఒక నల్లని సన్నగీత ఉంది, నా గుండె కొట్టుకునేచోట సరిగ్గా నాకు అలాంటి మచ్చే ఉంది. ఒక చిన్న ముద్ర, రాజముద్ర దానిద్వారా అందరికీ తెలుస్తుంది నువ్వు నన్ను కని తీర్చిదిద్దావని నీ స్వంతమని తెలిసేలా ముద్రవేసావని. . వినిఫ్రెడ్ వెల్స్ (1893-1939) అమెరికను కవయిత్రి . Resemblance . I have on mine no likeness To your fairy queen like face, No sign in all my body Of any of your grace. I might have been a changeling, As well have been a son, As to grow up your daughter And look like anyone. But where your two breasts parted A small mark darkened you, And over my heart’s beating I have the same scar too. A little seal and golden, Whereby it shall be known That you have shaped and borne me And stamped me as your own! . Winifred Welles (1893-1939) American http://www.bartleby.com/273/94.html Contemporary Verse Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిడిసెంబర్ 30, 2016