నేను పాడుతూ వస్తాను… జాకబ్ ఓస్లాండర్

వర్షంలో తడిసిన పచ్చగడ్డి
కోసినపుడు వెలువడే సుగంధం గురించీ
వెన్నులోని గింజలమీదనుండి జాలువారే
చల్లని నీటిబిందుల పులకరింతలు గూర్చీ
మైదానంలో నలుచెరగులా విస్తరించే
వర్షస్నాతయైన వెలుతురు గురించీ
పాడుతూ వస్తుంటాను

విరబూచిన శరత్కాలపు వెన్నెలలగురించీ
లోయల పిలుపులకు
గుంపులు గుంపులుగా ప్రతిధ్వనిస్తూ
ఎగసే పిచ్చుకలగురించీ
పిచుకలపై వాలుతున్న తడిబారిన
పడమటిగాలి గురించీ ఆలపిస్తూ వస్తాను.

నిర్దాక్షిణ్యంగా కొరుక్కుతినే తెల్లని డిశంబరు నెల గురించీ
బుసి ఆరిన చలిమంటలపై వీచిన గాలి రివటకి
ఊగుతున్న ఉక్కువంటి చిక్కని చీకటిగురించీ,
సూర్యాస్తమయాలగురించీ, ఉక్కులాటి నక్షత్రాల్ని
అరగదీస్తున్న ఎత్తైన దట్టమైన పచ్చని చెట్ల వరుసలగురించీ
పాడుకుంటూ వస్తాను.
.
జాకబ్ ఓస్లాండర్

.

I Come Singing

 .

I come singing the keen sweet smell of grass

Cut after rain,

And the cool ripple of drops that pass

Over the grain,

And the drenched light drifting across the plain.

I come chanting the mad bloom of the fall.

And the swallows

Rallying in clans to the rapid call

From the hollows,

And the wet west wind swooping down on the swallows.

I come shrilling the sharp white of December,

The night like quick steel

Swung by a gust in its plunge through the pallid ember

Of dusk, and the heel

Of the fierce green dark grinding the stars like steel.

.

Jacob Auslander

Poem Courtesy:

http://www.bartleby.com/273/12.html

The New Republic, March 24

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: