అతనికి తెలీదు… హారీ కెంప్, అమెరికను కవి
అతనికి తను చనిపోయాడని తెలియదు;
రద్దీగా ఉన్న వీధిలో నడుచుకుంటూ వెళ్ళాడు,
దారిలో ఎదురైన స్నేహితులందరినీ
టోపీ తీసి, తలూపి పలకరిస్తూ నవ్వేడు.
అందరూ ఏమీ పట్టనట్టు పక్కనించి వెళ్ళిపోయారు
ఏమీ తెలియనట్టు కళ్ళలో కళ్ళుపెట్టి తెల్లబోయిచూసారు;
అతనే ఏదో గాలి రివట అన్నట్టు పట్టించుకోకుండా
ఏటోదిక్కులుచూస్తూ తమత్రోవన నడిచిపోయారు.
“ఏదో జరగరాని విషయమేదో జరిగి ఉండాలి,”
అని మృతుడు మనసులో అనుకుని త్వరగా ఇంటిముఖం పట్టాడు.
అతని భార్య అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ
దువ్వెనతో దువ్వుకోవాలా వద్దా అని తటపటాయించడం గమనించాడు.
అతని భార్య నల్లని శోకవస్త్రం ధరించి ఉంది;
ఆమె పెదాలు ముద్దుపెట్టుకుని, తల ఆప్యాయంగా నిమిరాడు.
“నేను అక్కడినుండి తిరిగి వస్తున్నప్పటినుండి చూస్తున్నాను,
మనుషులు చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు,” అన్నాడు.
ఆమె మారు పలకలేదు; నవ్వి ఊరుకుంది;
ఆమె తన పేరు పలకడం విన్నాడు.
దుఃఖంనిండిన కళ్ళతో, చట్రంలో బిగించిన
తన చిత్రాన్ని ఆమె పరిశీలించడం చూశాడు.
అప్పుడతనికి ఆ చీకటి రాత్రి గుర్తుకొచ్చింది; తనని ఆవరించిన
విపులమైన ఎర్రని కవచం ఒక్కసారి పగలడం
అకస్మాత్తుగా తను వెలుతురులోకి నెట్టబడడం గుర్తొచ్చింది;
అతనికిపుడు అర్థమయింది తను చనిపోయాడని.
.
హారీ కెంప్,
(December 15, 1883 – August 5, 1960)
అమెరికను కవి

He Did Not Know
.
HE did not know that he was dead;
He walked along the crowded street,
Smiled, tipped his hat, nodded his head
To his friends he chanced to meet.
And yet they passed him quietly by
With an unknowing, level stare;
They met him with an abstract eye
As if he were the air.
“Some sorry thing has come to pass,”
The dead man thought; he hurried home,
And found his wife before her glass,
Dallying with a comb.
He found his wife all dressed in black;
He kissed her mouth, he stroked her head.
“Men act so strange since I’ve come back
From over there,” he said.
She spoke no word; she only smiled.
But now he heard her say his name,
And saw her study, grief-beguiled,
His picture in a frame.
Then he remembered that black night
And the great shell-burst, wide and red,
The sudden plunging into light;
And knew that he was dead.
.
Harry Kemp
(December 15, 1883 – August 5, 1960)
American Poet
The Century Magazine, October 1919
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి