ఇక ఇపుడు దేవుళ్ళు లేరు కాబట్టి, దేవుడి ప్రతిరూపాలయిన రాజులుకూడా లేరు కాబట్టి భూమి మీద మనిషి ఒంటరివాడు సూర్యుణ్ణి పోలిన బోలెడు నక్షత్రాలతో ఏకాకి.
రాత్రిపూట సమాధానం చెప్పలేని తన నక్షత్రసమూహాలమధ్య తిరుగుతుంటాడు. అతని చేతులు ఎంత అశక్యమైనవో తెలుసు కళ్ళు వెలుస్తురులో మోసం చేస్తాయనీ తెలుసు.
ఇక్కడ గెలవడానికి ఏ బహుమానాలూ లేవని తెలుసు నల్లగా తను పట్టిపోయిన బూజుతప్ప, తన కల ముందుగా ముగిసిపోడం చూస్తాడు యవ్వనం ముసలితనంగా మారడం చూస్తాడు.
అయినా, నిరాస వల్ల అన్నిటినుండీ విముక్తుడు అన్ని బంధాలనుండీ, నమ్మకాలనుండీ, బాధలనుండీ. దేనివల్లా ఏ లాభం లేదని తెలిసిన వాడిని ఇక ఏది భయపెట్టగలదు?
దేవుళ్ళస్థానాన్ని అతను ఆక్రమించినపుడు అల్లకల్లోల స్థితి అతని పాలు, భావి అంతా యుద్ధాలతో మారుమోగే ప్రపంచాలు అతని చెవుల్లో హోరుమంటుంటాయి.
ఇపుడిక దేవుళ్ళు అంతరించేరు గనుక, అతని చేతిలో ఆకాశం మట్టిపాలవుతుంది; బంజరుభూమిలమీంచి ఎగిరే ధూళిలా అతని వేళ్ళ సందుల్లోంచి అవి జారిపోతుంటాయి,
అతని దృష్టి అందాన్ని దుఃఖాన్నీ చూడగలడు రాబోయే శతాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి. అన్ని వస్తువులకీ అన్నిరకాలుగా అతనే సృష్టికర్త ఒంటరిగా తపించే మూర్ఖుడూ అతనే. .
మేక్స్ వెల్ ఏండర్సన్ December 15, 1888 – February 28, 1959 అమెరికను నాటక కర్త, కవి.