అనువాదలహరి

మృత్తిక … డోరతీ ఏండర్సన్, అమెరికను కవయిత్రి

ఈ కవితలో చమత్కారం… రెండు అసమాన దృశ్యాలను ప్రదర్శిస్తూనే, వాటిలోని సాదృశ్యతని వాచ్యం చెయ్యకుండా చెప్పడం. అన్నీ మట్టిలో కలిసిపోయేవే. కానీ, జీవం ఉట్టిపడుతున్నప్పుడు ఆ మట్టే ఇన్నిరూపాలుగా ప్రతిఫలిస్తుంటుంది.

.

మృత్తిక అంటే ఏమిటి?

బూడిదైపోయిన ప్రేమ, కాలిపోయిన ఉత్తరాలు, వాడిపోయిన సూర్యముఖి,

మృతుడిచేతిలోంచి జారిపడిన గులాబి రేకులు;

సాలీళ్ళు, గబ్బిలాలు, పాడుబడిన ఇళ్ళు, కూలుతున్న కోటలు,

గతిపంచిపోయిన సైనికుల రథచక్రాల జాడలు.

అంతేనా?

మృత్తిక అంటే, వెలుగు, నవ్వులు,

సర్కసులు, విలాసవంతమైన గొడుగులు,

ముక్కుతో రెక్కలు శుభ్రంచేసుకుంటున్న పావురాలు,

రోడ్డుప్రక్క వనభోజనం చేస్తున్న ప్రేమికులు,

ఎండలో రోడ్డుమీద తదబడుతూ నడుస్తున్న నిరుపేద.

మృత్తిక అంటే సువాసనలు వెదజల్లే పొదలలో చిక్కుబడ్డ హరివిల్లులు.

తారల మిరిమిట్లకు నా కళ్ళు మూసుకుపోకుండా రక్షిస్తున్నది ఈ ధూళికణాలే!

.

డోరతీ ఏండర్సన్

అమెరికను కవయిత్రి

.

Dust

.

    What is dust?

Ashes of love, charred letters, faded heliotrope,

Rose petals fallen from a dead hand,

Spiders, bats, deserted houses, crumbling citadels,

And wheel ruts where vanished armies have passed.

    Is that all?

Oh, dust is sun and laughter,

Circuses, parasols, preening pigeons,

Lovers picnicking by the roadside,

And ragamuffins tumbling in the warm lanes.

Dust is rainbow webs caught in sweet, hot smelling hedges,

And it is dust that keeps my eyes from being blinded by the stars!

  (From: Contemporary Verse, November, 1919.)

.

Dorothy Anderson

American

 Poem Courtesy: http://www.bartleby.com/273/98.html

 

3 thoughts on “మృత్తిక … డోరతీ ఏండర్సన్, అమెరికను కవయిత్రి”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: