శ్మశాన వైరాగ్యం… W H ఆడెన్, ఇంగ్లీషు కవి గడియారాలన్నీ ఆపండి, టెలిఫోన్లు కత్తిరించండి, రసాలూరు బొమికని కొరుకుతూ అరుస్తున్న కుక్కని అరవనీకండి, చాలు! పియానోవాయించడాన్ని ఆపమనండి, మద్దెలపై గుడ్డకప్పండి శవపేటికని బయటకి తీసుకు రండి, శోకించేవాళ్ళని దారి ఇవ్వండి. అతని మరణవార్తని ఆకాశంలో రాసుకుంటూ, విమానాలను నెత్తిమీద విచారసూచకంగా చక్కర్లు కొట్టనీండి తెల్లని పావురాల మెడల్లో మెత్తని పట్టు దండలు వెయ్యండి రాకపోకలు నియంత్రించే పోలీసుల్ని నల్లని చేతిమేజోళ్ళు ధరించమనండి అతనే నాకు తూరుపూ, పడమరా, ఉత్తరం, దక్షిణం నా పనిరోజులూ, ఆదివారాల విశ్రాంతీ అతనే అతనే నా చంద్రుడూ, నా అర్థరాత్రీ, నా మాట, నా గీతం; నేను ప్రేమ శాశ్వతం అనుకున్నాను; కాదు, నేను తప్పు. ఇక నక్షత్రాల అవసరం లేదు; అన్నీ ఆరిపెయ్యండి; చంద్రుణ్ణి మూటగట్టి, సూర్యుణ్ణి ఏ కీలు కా కీలు విడగొట్టండి సముద్రాల్ని తోడి పారబొయ్యండి, అరణ్యాలను చదునుచెయ్యండి ఇక ఇప్పుడు ఏదీ ఎందుకూ పనికి రాదని తేలిపోయింది . . W H ఆడెన్ 21 February 1907 – 29 September 1973 ఇంగ్లీషు కవి . Funeral Blues . Stop all the clocks, cut off the telephone, Prevent the dog from barking with a juicy bone, Silence the pianos and with muffled drum Bring out the coffin, let the mourners come. Let aeroplanes circle moaning overhead Scribbling on the sky the message He Is Dead, Put crepe bows round the white necks of the public doves, Let the traffic policemen wear black cotton gloves. He was my North, my South, my East and West, My working week and my Sunday rest, My noon, my midnight, my talk, my song; I thought that love would last for ever: I was wrong. The stars are not wanted now: put out every one; Pack up the moon and dismantle the sun; Pour away the ocean and sweep up the wood. For nothing now can ever come to any good. . WH Auden 21 February 1907 – 29 September 1973 English Poet Poem Courtesy: http://unix.cc.wmich.edu/~cooneys/poems/auden.stop.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 3, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#1808English PoetW H Auden Untimely Rain… Bandla Madhava Rao, Telugu, Indianప్రత్యూషవేళలో కీచురాళ్ళు… లెనోరా స్పేయర్, అమెరికను స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.