ఇసుకరేణువులు- I (జూన్ రాత్రి)….. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓ ధరణీ! నువ్వీ రాత్రి ఎంత అందంగా ఉన్నావు!
నలు చెరగులా వాన వాసన వ్యాపిస్తూ
దూరంగా గంభీరమైన స్వరంతో కడలి
నేలతో మాటాడుతుంటే, నాకు నిద్ర ఎలా వస్తుంది?
ఓ పుడమితల్లీ, నాకున్నదంతా నువ్విచ్చిందే,
నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇష్టం.
ప్రతిగా నీకివ్వడానికి నాదగ్గర ఏముంది?
నేను మరణించిన తర్వాత నా శరీరం తప్ప?
.
సారా టీజ్డేల్
(1884–1933)
అమెరికను కవయిత్రి
.
Sea Sand-1
.
June Night
O Earth you are too dear to-night,
How can I sleep, while all around
Floats rainy fragrance and the far
Deep voice of the ocean that talks to the ground?
O Earth, you gave me all I have,
I love you, I love you, oh what have I
That I can give you in return—
Except my body after I die?
.
Sara Teasdale
(1884–1933)
American
Poem Courtesy:
http://www.bartleby.com/273/49.html
The Bookman
పోలికలు… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
నా ముఖంలో ఎంతవెదికినా నీకున్న
దేవరాజ్ఞి ముఖం పోలికలు లేవు
నా శరీరంలో ఎక్కడా నీకున్న
లావణ్యం మచ్చుకి కనరాదు.
ఏ దేవమాయో నను తారుమారుచేసుండొచ్చు
బహుశా నేను కొడుకునయినా అయి ఉండొచ్చు
కానీ, నేను నీకూతురులా పెరిగి
నలుగురిలో ఒకతెగా కనిపించడానికి.
నీ రొమ్ములు రెండూ విడివడేచోట
ఒక నల్లని సన్నగీత ఉంది,
నా గుండె కొట్టుకునేచోట సరిగ్గా
నాకు అలాంటి మచ్చే ఉంది.
ఒక చిన్న ముద్ర, రాజముద్ర
దానిద్వారా అందరికీ తెలుస్తుంది
నువ్వు నన్ను కని తీర్చిదిద్దావని
నీ స్వంతమని తెలిసేలా ముద్రవేసావని.
.
వినిఫ్రెడ్ వెల్స్
(1893-1939)
అమెరికను కవయిత్రి
.
Resemblance
.
I have on mine no likeness
To your fairy queen like face,
No sign in all my body
Of any of your grace.
I might have been a changeling,
As well have been a son,
As to grow up your daughter
And look like anyone.
But where your two breasts parted
A small mark darkened you,
And over my heart’s beating
I have the same scar too.
A little seal and golden,
Whereby it shall be known
That you have shaped and borne me
And stamped me as your own!
.
Winifred Welles
(1893-1939)
American
http://www.bartleby.com/273/94.html
Contemporary Verse
నెత్తిమీద… స్కడర్ మిడిల్ టన్, అమెరికను
నిన్నూ నన్నూ చిన్నపెట్టెలలో భూమిలో
పడుకోబెట్టినచోట గడ్డి ఒత్తుగా మొలిచినపుడు
చిరునవ్వులతో మనమీంచి నడుచుకుంటూ వేళ్ళే
నాగరీకులు మనగురించి రేపు ఏమనుకుంటారు?
ఆమె ముచ్చటైనది, నెమ్మదస్తురాలు,
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, ఆనందంగా ఉంచేది.
ఆమె ఇప్పుడు ఎంత హాయిగా ఉందో
జీవితంపట్లకూడా అంత ఆశావహంగా ఉండేది.
మనకి తెలిసి అంత తెలివైన వాడు మనలో లేడు
అతను పోయేదాకా అందర్నీ నవ్విస్తుండేవాడు
అతను మాటలాడడం ప్రారంభించాలి, అంతే,
పక్కనతనున్నంతసేపూ, పొట్టచెక్కలయ్యేది.
అప్పుడు మనిద్దరం పెట్టె మూతవేసుకుని
మృతులభాషలో మాటాడుకుంటాం.
వాళ్ళు అలా మాటాడుకోకుండా ఉండడానికి
మనం చెయ్యగలిగినది ఏమీ లేదు.
.
స్కడర్ మిడిల్ టన్
(Sept 9, 1888 – 1959)
అమెరికను కవి
.
Overhead
.
When you and I are laid away
In little boxes under grass,
What will the townsmen say of us
When overhead they smile and pass?
“She was a lovely, quiet thing
Who kept her house so neat and gay.
She was as much in love with life
As she is satisfied today.”
“He was the brightest man we had;
He kept us laughing till he died.
It seemed he only had to speak,
And we would chuckle at his side.”
Then you and I will rap the boards
And call in language of the dead—
But there’ll be nothing we can do
To stop that chatter overhead.
.
Scudder Middleton
(Sept 9, 1888 – 1959)
American
Poem Courtesy:
http://www.bartleby.com/273/105.html
Harper’s Magazine
ఓ మిత్రమా! … ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను
ఓ నా మిత్రమా!
నీ గురించి చెప్పడానికి నాదగ్గిర తగిన మాటలేవీ?
ఓ నా చెలికాడా!
చెప్పలేనన్ని సంభాషణలు పంచుకున్నవాడా!
నా ప్రేరణా!
నా మార్గదర్శీ!
నా ఉత్తమవ్యక్తిత్వాన్ని బయటకి తెచ్చినవాడా!
ఈ దేశా పశ్చిమభాగానికి నువ్వొక వెలుగువి.
నువ్వే ఒక సంపదల ఖనివి.
అఖండ యశస్సువి
ఒక చెప్పలేని ఆకర్షణవి
ఈ సంయుక్త రాష్ట్రాల పంటవీ, సంపదవీ నువ్వు!
బిల్! నువ్వు లేవని తెలుసు.
నేను ఈ ఊర్లోకి పొద్దున్నే వచ్చేను.
జిగేలుమంటున్న ఈ జులై నెల ఎండలోనూ, కార్ల హడావిడిలోనూ
నువ్వు మనసులో మెదిలావు.
నిజానికి ఈ కబురు నాకు అందింది.
మళ్ళీ నీతోనే ఎక్కడో నవ్వుతూ,
కబుర్లు చెబుతూ గంటలు గంటలు గడుపుదును గాక!
.
ఎడ్గార్ లీ మాస్టర్స్
(August 23, 1868 – March 5, 1950)
అమెరికను
Photo Courtesy:
https://www.poets.org/poetsorg/poet/edgar-lee-masters
.
O, My Friend!
.
O, my friend,
What fitting word can I say?
You, my chum,
My companion of infinite talks,
My inspiration,
My guide,
Through whom I saw myself at best;
You, the light of this western country.
You, a great richness.
A glory,
A charm,
Product and treasure of these States.
Bill, I knew you had gone.
I was walking down into town this morning,
And amid the hurry of cars and the flash of this July sun,
You came to me.
At least the intimation came to me;
And may it be you,
That somewhere I can laugh and talk long hours with you again.
.
Edgar Lee Masters
(August 23, 1868 – March 5, 1950)
American Attorney, Poet, Dramatist
Poem Courtesy:
http://www.bartleby.com/273/116.html
(This poem was a tribute to his friend William Marion Reedy by the poet )
Reedy’s Mirror
ఇష్టమైన పువ్వు… ఇరా టైటస్
మే నెలలో ఆకాశం నిర్మలంగా ఉన్న ఒక రోజు
చంద్రుడు ధవళ సుగంధపుష్పంలా ఉన్నాడు:
తీసి నా కోటుకి తగిలిద్దును కదా
ప్రేమరసప్రవాహంలా ఉన్నాడు.
నేనిప్పుడు
నగరవీధుల్లో
సంచారం చేస్తున్నప్పుడు తగిలించుకుంటాను
నేను తమ పక్కనుండి పోతుంటే
పౌరులంటుంటారు :
“అతనికి చాలా మంచి మనసుంది” అని.
వాళ్ళు నా కిష్టమైన పుష్పాన్ని చూడరు.
వాళ్ళకి తెలియదు
నా జీవనసౌరభం ఎక్కడనుండి వచ్చిందో.
.
ఇరా టైటస్
.
My Flower
.
One night in May in a clear sky
The moon was a daisy flower:
And! put it in my coat,
A bouquet of Love!
Now I shall wear it
When I go
Along the city streets:
The people will say
As I pass by—
“He has a sweet soul!”
They will not see my flower,
And cannot know
Whence comes the fragrance of my spirit!
Ira Titus
Poem Courtesy:
http://www.bartleby.com/273/16.html
The Wayfarer
మహరాజా మాక్స్మిలన్… కోర్సన్ మిల్లర్, అమెరికను
ఆటపట్టించడానికి అతన్ని ఎప్పుడూ మహారాజా మాక్స్మిలన్ అని పిలిచే వాళ్లం;
అతను రోజూ మాకు ఎదురయ్యేవాడు, పాపం, అన్నడూ మాటాడేవాడు కాదు.
తొడుక్కున్నచెప్పులు అరిగి చిరిగిపోయేయి, కాళ్లకి సరిపడేవి కావు;
చింకి కోటు, మాసి మరకలుపడ్డ చొక్కాతో రోడ్డుమీద జోరుగా పొయ్యేవాడు.
పొద్దుపుచ్చడమెలాగో తెలీక, ఒకరోజు మాక్స్ ని మేం ఎంతో వినయపడుతూ ఆపినపుడు,
భయంభయంగా, అనుమానంతో మావంక చూడసాగేడు
“దక్షిణసముద్ర కన్నియలు నృత్యంచేసే, ఎవరూ ఎరుగని ద్వీపానికి
తమరు మహరాజని విన్నాం, నిజమేనా?” అని అతన్ని అడిగినపుడు
అబ్బ! చూడాలి, మహారాజా మాక్స్మిలన్ ఒక నిర్లిప్తమైన చిరునవ్వొకటి నవ్వేడు.
ఎంతో హుషారుగా చెప్పేడేమో, అతని సమాధానం నేనెన్నడూ మరిచిపోలేను:
“కాకపోవడమేమీ, నా కనుచూపుమేర కనిపించేదంటటికీ మహరాజునే.
నా రాజ్యం నిండా పిల్లలాడుకునే సూర్యుడివెలుగులునిండిన లతానికుంజాలున్నాయి
నా రాజదండం పల్లె త్రోవల్ని మేల్కొలిపే ముత్యాలవంటి పాటలో ఉంది,
నా ఆతిథ్యశాల తొలకరిచినుకుల్లో నృత్యంచేసే కలలటో నిండి ఉంది
ఈ అద్భుత, సువిశాలమైన ప్రపంచమే నా సామ్రాజ్యం, కానీ, నే నిక్కడే ఉంటాను,
పేదరికమనే పిల్లని పెళ్ళాడేను, నేను చాలా తృప్తిగా ఉన్నాను.
నేనేపనీ చెయ్యను- రాజులెప్పుడూ పనిచెయ్యరు; నా చేతులెందుకు మురికిచేసుకోడం?
ఈ వర్తమానానికి అధిపతిని, ఈ నగరాలకీ, పచ్చికబయళ్ళకీ.
నేను బహుశా ఒక కళాకారుణ్ణి అయి ఉండొచ్చు; అస్తమయవేళ ఆకాశాన్ని చిత్రిస్తాను;
బహుశా నేను కవినై ఉండొచ్చు, ఆకురాలుకాలం అంతరించిన తర్వాత.
రోజుకి ఒకపూట భోంచేస్తాను, ఎక్కడినుండి వస్తుందో ఎవరికీ తెలియదు.
అది నాకు అందించే నాథుడే, నాకు బట్టలుకూడా ఏర్పాటుచేస్తాడు.
ఎండా వానా నాకు సావాసగాళ్ళు, నక్షత్రాలు నాకు ఆనందహేతువులు,
నేను పిల్లాడిగా ఉన్నప్పుడు, మా అమ్మకళ్ళలో చూసిన కాంతుల్ని గుర్తుచేస్తుంటాయి.
డబ్బుకొనలేనిదానివాటికన్నింటికీ మహరాజును నేనే.
భూమిమీద అత్యంత సంపన్నుడు సైతం, నాలాగే, ఏదోరోజు కనుమరుగవవలసిందే.”
అది దాటి మహరాజా మాక్స్మిలన్ మరొక్కమాట మాటాడలేదు.
అతనలా నడుచుకుంటూ పోతుంటే, మేమే అరిచాం, “మహరాజంటే అక్షరాలా నువ్వే!” అని.
.
కోర్సన్ మిల్లర్
అమెరికను
.
Maximilian Marvelous
.
“Maximilian marvelous,” we called him for a joke;
He used to pass us every day, but rarely ever spoke.
The shoes he wore were scandalous—they did not fit his feet;
In tattered coat and greasy shirt he shuffled down the street.
When once we stopped Max solemnly, to pass the time of day,
He looked at us, half-doubting, in a hesitating way,
And when we asked him if ’twere true that he was once a king
Of some forgotten island, where the South Sea maidens sing,
Lo! Maximilian Marvelous gave us a withering smile.
I’ll ne’er forget his answer, as it came in vigorous style:
“I am a king of everything my roving eyes survey.
My kingdom’s built of sun-lit bowers where little children play,
My sceptre’s made of jeweled song that wakes old village lanes,
My banquet hall is piled with dreams that romp in April rains.
The great, wide world is my estate, but here I choose to ’bide,
I married Lady Poverty, and I am satisfied.
I do not work—kings never work; why should I soil my hands?
I am the ruler of my time, for town or meadow lands.
Perhaps I am an artist; then I paint the sunset sky;
Perhaps I am a poet when the days of Autumn die.
I eat one square meal every day; its source nobody knows,
And he who gives it to me sees I also get some clothes.
The sun and rains are friends of mine, the stars are my delight,
They bring me thoughts of childhood when my mother’s eyes were bright.
I am a king of everything that money cannot buy.
The richest man on earth, like me, must some day fade and die.”
Then Maximilian Marvelous said not another thing;
And as he walked away we cried, “He’s every inch a king!”
.
Corson Miller
American
Poem Courtesy:
http://www.bartleby.com/273/80.html
New York Times, February 8, 1920
నావికులు… డేవిడ్ మోర్టన్, అమెరికను కవి
Merry Christmas To All My Christian Friends
ఓడలను ప్రేమించిన మనుషులు సముద్రం మీదకి వెళ్తారు
పొడవైన ఓడ స్థంబాల్నీ, నురుగుతో ఒరుసుకునే ఓడ తట్టుని ప్రేమిస్తారు.
వాళ్ళ మనస్సుల్లో, ఎక్కడో, ఇంటికన్నా ప్రియమైన
ప్రదేశం మరొకటి ఉందని తెలుసుకుంటారు.
పై కప్పుమీద నడుస్తారు, తెరచాపని చుక్కల్లోకెగరేస్తారు,
రాత్రి కాపలా కాస్తూ శుభ్రంగా ఉన్న బల్లలు లెక్కెడుతుంటారు …
ఇవీ, జారుగా ఉండే వాడస్తంబం మీద మెరిసే సూర్యకిరణాలూ
వాళ్ళని నిత్యం వెంటాడుతుంటాయి… మెలకువలోనూ, నిద్రలోనూ
ఒడ్డుకి చేరినా, వీళ్ళు తక్కిన మనుషుల్లా ఉండలేరు:
జనసమ్మర్దమున్న వీధుల్లో సైతం అపరిచితుల్లా నడుస్తారు.
లేదా, చలిమంటల దగ్గర ఏవో ఆలోచిస్తూ, ఓడ వెనుకతట్టున
ఒరిసిపారే నీటి గలగలలు నెమరువేసుకుంటారు.
ఇసకతిన్నెలకు ఆవల విశాలమైన జలమార్గాన్ని కలగంటారు
దానిపై చంద్రుడితోపాటు పయనించే ఒంటరి ఓడనూ చూస్తారు.
.
డేవిడ్ మోర్టన్
(February 21, 1886 – June 13, 1957)
అమెరికను
.
Mariners
.
Men who have loved the ships they took to sea,
Loved the tall masts, the prows that creamed with foam,
Have learned, deep in their hearts, how it might be
That there is yet a dearer thing than home.
The decks they walk, the rigging in the stars,
The clean boards counted in the watch they keep—
These, and the sunlight on the slippery spars,
Will haunt them ever, waking and asleep.
Ashore, these men are not as other men:
They walk as strangers through the crowded street,
Or, brooding by their fires, they hear again
The drone astern, where gurgling waters meet,
Or see again a wide and blue lagoon,
And a lone ship that rides there with the moon.
.
David Morton
(February 21, 1886 – June 13, 1957)
American Poet
Poem Courtesy:
http://www.bartleby.com/273/75.html
Harper’s Magazine
కాలవందనం… హామిల్టన్ ఫిష్ ఆర్మ్ స్ట్రాంగ్, అమెరికను
మనం దేనికి పోరాడేమో అది పోరాటానికి అనర్హమని అనిపించినపుడు
మన గెలుపు చివరకి ఓటమిగా పరిణమించినపుడు
స్వప్నం ఎప్పుడూ వినాశనానికి అతీతంగా మిగిలి ఉంటుందనీ
ప్రతి పోరాటమూ ఒక ముసుగు తొలగిస్తుందనీ తెలుసుకో
అలసిన గుర్రమూ, నిరాశకు గురైన రాజకీయవేత్తా
మన గమ్యాలు మసకబార్చవచ్చు, గాని అందుకోకుండా ఆపలేరు.
కాలం ఠీవిగా అడుగులేసుకుంటూ తన పనిమీద తాను పోతుంది
ఆత్మలో క్రమేపీ వచ్చే పరివర్తనలు దానికి ఎరుకే.
.
హామిల్టన్ ఫిష్ ఆర్మ్ స్ట్రాంగ్
April 7, 1893 – April 24, 1973
అమెరికను
.
Lines for the Hour
.
If what we fought for seems not worth the fighting,
And if to win seems in the end to fail,
Know that the vision lives beyond all blighting
And every struggle rends another veil.
The tired hack, the cynic politician,
Can dim but cannot make us lose the goal,
Time moves with measured step upon her mission,
Knowing the slow mutations of the soul.
.
Hamilton Fish Armstrong
April 7, 1893 – April 24, 1973
American Diplomat and Editor
Courtesy:
http://www.bartleby.com/273/119.html
New York Evening Post
నిను మరిచిపోలేను… హెర్బర్ట్ గోర్మన్, అమెరికను
నిను మరిచిపోలేను;
రాత్రనక పగలనక
కలల్లోకి వస్తూ
“నేను! నేను!” అంటుంటావు.
నేను లేచి వచ్చి తలుపు గడియ వేస్తాను.
నువ్వెంత తలుపు తట్టినా వినిపించుకోను.
నువ్వు వెళిపోయిన తర్వాత
రేయింబవళ్ళు విశ్రాంతి తీసుకుంటాను.
“నేనూ! నేనూ!”
అని అరవని నిశ్శబ్దంలో
ఒక శూన్య ప్రశాంతతలో
నిర్వాణాన్ని పొందుతాను.
.
హెర్బర్ట్ గోర్మన్
1893- 1954
అమెరికను
.
I Cannot Put You Away
.
I cannot put you away;
By night and day
You come in a dream and cry,
“It is I! It is I!”
I will rise and turn the lock
Nor heed your knock,
But rest for a night and day
With you away.
And then I will find release
And empty peace,
In silence that will not cry
“It is I! It is I!”
.
Herbert S. Gorman
1893- 1954
American Literary Critic
http://www.bartleby.com/273/42.html
New York Sun Books and the Book World