ఇంతకుమునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు; ఆ పుష్పాలూ, ఆ పిట్టలూ, ఆ తరులతాదుల శోభా… ఎప్పుడూ నాకు జంటగా నా ప్రేమిక ఉండడమే కారణం— ఇటువంటి పారితోషికాలనుండి రక్షించగలిగేది, ప్రేమ ఒక్కటే!
కానీ, ఇపుడు నేను ఒంటరిని, సుదీర్ఘమైన రేయింబవళ్ళిపుడు కేవలం జ్ఞాపకాలతో వెళ్ళబుచ్చడమే పని . మేము జంటగా గడిపిన ఏప్రిల్ నెలలలో ఎన్నడైనా వసంతం మనసునింత గాయపరిచేదిగా ఉందా?
మునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు ఈ పసిడివెలుగుల వరద… నా దుఃఖాన్ని అతిశయిస్తోంది. వసంతాగమనవేళ… ఒంటరిగా ఉండడమంటే… ఆ వ్యక్తి మృతుడైనా అయి ఉండాలి… ముదిమి ఒక్కసారిగా పైబడైనా ఉండాలి. .