చూసే దృష్టికోణం ద్వైదీభావనతో మోసగిస్తుంది:
రైలుపట్టాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి,
మరెక్కడోకాదు, అసంభవమైన మనోనేత్రంలో.
సముద్ర తరంగాలు నింగిని కడుగుతున్నట్టు భ్రమింపజేసే క్షితిజరేఖను
దాటిపోదామని మేధోసాగరాలమీద దిగంతరాలకు
వెళుతున్న కొద్దీ, అవి వెనుకంజవేస్తూనే ఉంటాయి”
ఇది నిజమని మనం అంగీకరిస్తే, ఒకరి దేముడు
మరొకరికి దయ్యంగా కనిపించడం మనకి ఆశ్చర్యం కలిగించదు;
లేదా, సప్తవర్ణాల సూర్య కాంతి,
నీడలోని అనేకానేక వన్నెలుగా కనిపించవచ్చు;
సందేహాల ఊబిలో చిక్కినపుడు, ఎటూ తేల్చుకోలేకపోడమే
మనజీవితాలకి అధిగమించలేని పెద్ద అవరోధం
.
కనుక ప్రియతమా! రాత్రి నక్షత్రాలు మనకి జోలపాడేదాకా
ఈ విశ్వరహస్యాలకు చెందిన ప్రతి అంశపు మంచి చెడులగురించి
నువ్వూ నేనూ పిచ్చివాళ్లలా ఎంతసేపైనా వాదించుకోవచ్చు;
ఎంత స్పష్టమైన పడికట్టుమాటలతో విశ్లేషించినా
ఈ ప్రపంచం ఒక్క పిసరు కూడా మారదు, ఒక్క … గడియారం ముళ్ళు
పన్నెండు నుండి ఒకటికి నిరాఘాటంగా నడవడం మినహా .
మనం ఎంత పసలేని వాదనలని లేవదీస్తామంటే
వాటిని తర్కంతోనో, కాకుంటే అదృష్టంకొద్దీనో ఖండించడానికీ,
లేకుంటే సరదాకి మనం ఒకరితో ఒకరు విభేదించుకోడానికీ;
మనకి ఎవరో అన్నీ అమర్చిపెడుతుంటారు;
మనం దర్జా వెలగబెడతాం. ప్రేమ ఒక వనదేవత;
ఆమె తన చెలికత్తెల్ని పరిగెత్తిస్తూనే ఉంటుంది.
ఓ, నా మేధోనిధీ! ఇప్పుడు నువ్వు
సూర్యుడిని ఒక పెద్ద గుల్లచేపలా
ఒక్క గుటకలో, సముద్రం దిగువకి
నాచేత మింగించడానికి ప్రయత్నిస్తావు.
“చూస్తూండు! చీకటిలో ఆత్మహత్యచేసుకుంటున్న తోకచుక్క
నిద్రిస్తున్న ఈ నగరాన్ని అట్టుడికిస్తుంది” అనీ అంటావు.
కనుక, ఏదీ ఓ ముద్దుపెట్టు. వీధిలోని తాగుబోతులూ,
పరువులేని గుమ్మాలముందరి స్త్రీలూ వాళ్ల అసలుపేర్లు మరిచి,
తలమీద కొవ్వొత్తులతో గెంతులేస్తున్నారు.
ఆకులు చప్పట్లు కొడుతునాయి; శాంతా క్లాజ్
అందరికీ మిఠాయిలు పంచుతూ తన విమానంలో
పొడుపుకథలు పాటలుగా పాడుతూ వెళుతునాడు.
చంద్రుడు అందుకుందామని ఒకసారి వొంగుతాడు;
అపురూపమైన ఆ నదిలో వేటకి దొరక్క చేపలు నవ్వుతూ
కన్నుగీటుతాయి; ఎడా పెడా అందర్నీ పలకరిస్తూ మనం విచ్చలవిడిగా
ఆశీస్సులూ కురిపిస్తాం; చివరకి మూగవోయిన చర్చిఆవరణలోని
సమాధుల దగ్గర కూడా; నక్షత్రకాంతిలో మెరుస్తున్న
బిరుసెక్కిన సమాధులు జవాబుగా పాట ఎత్తుకునేదాకా.
ఏదీ మరొక ముద్దిచ్చుకో, ఈ రంగస్థలిమీది మన వెయ్యి అంకాల
నాటకానికి నిర్దయుడైన సృష్టికర్త వంగి తెర దించమనేలోగా
సిగ్గులేని నటులు ఎన్నిరకాలుగానైనా అతన్ని అనుకరించవచ్చు,
థియేటరులో దీపాలు వన్నె తగ్గి, రంగస్థలి ముందరిదీపాలు వెలగగా,
కుప్పలు తెప్పలుగా గులాబి దుస్తుల బఫూన్లు చిత్రధ్వనులతో, అనుకరణలతో
రంగస్థలికి ఒక ప్రక్కనుండి రెండోప్రక్కకి పాడుతూ పోనూవచ్చు.
ఇప్పుడు చెప్పు, నలుపో తెలుపో మొదలైన చోట దెప్పుతాం
వేణువుల్ని వాయులీనాలనుండి వేరుచేస్తాం:
పరిపూర్ణతల బీజగణితం
ఆకారాలు వికారంగా కదిలే చిత్రదర్శినిలో
భగ్గుమంటుంది; వాదించే ప్రతికోతీ
తన శత్రుకూటమిలో చేరిపోతుంది.
ఇక్కడున్న వైరుధ్యం నటనే వస్తువు కావడం:
ప్రముఖతార మూతివిరిచినా, విమర్శకుడు తప్పుపట్టినా
ఆ వల్లించిన సంభాషణల పరంపరలో అంతర్లీనంగా
కళ ఉట్టిపడుతూనే ఉంటుంది, క్షణకాలం పాత్రలో మమేకమవడం ఉంటుంది
దాన్ని స్వాప్నికులు నిజమనుకుంటే, వాస్తవికవాదులు భ్రాంతి అంటారు.
ఎగురుతున్న పక్షులగుంపును చూసినప్పటి అనుభూతి అది.
ఆకసాన్ని చీల్చే కిరణాలు, తమ ప్రయాణంలోనే
తన్మయత్వపు రహస్యం దాగుందని తెలిసి ;
ఏదో ఒకరోజు, పయనిస్తూ పయనిస్తూ, రాలిపోతుంది
అలా రాలి, మరణిస్తుంది ఒకగాయాన్ని చేస్తూ.
అది తిరిగి గాయం మానుతుంటే, రేగుతుంది
జననమరణాల ఫీనిక్స్ చక్రం ఎన్నడూ ఆగదు.
కనుక మనం శిధిలమైన ప్రపంచమనే
“వాల్-నట్” పెంకులమీంచి ఉత్తికాళ్ళతో నడుద్దాం
అల్పమైన స్వర్గ నరకాల్ని ఆత్మలు దాసోహమని
అరిచేలా మట్టుపెడదాం; మన శయ్యని “జాక్ “
చిక్కుడుపందిరి అంత ఎత్తులో కట్టుకుందాం;
మనకి మిగిలి ఉన్న రోజులూ వారాలూ
పదునైనకత్తి తెగనరికేదాకా ప్రేమించుకుందాం.
అప్పుడు, నీలి గుడారం వాలిపోతుంది, చుక్కలు జలజలా రాలిపోతాయి.
భగవంతుడో, శూన్యమో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి
మన కన్నీళ్ళలో మనం మునిగిపోయేదాకా; కనుక ఇవాళే ప్రారంభిద్దాం
మురళీధరుడికి ఒక్కొక్క శ్వాసతో ఋణం తీర్చుకోవడం.
అయినా, ప్రేమకి మృత్యువు గురించీ తెలీదు
హృదయాన్ని హృదయంతో కలపడం దాటి లెక్కలూ రావు.
.
సిల్వియా ప్లాత్
October 27, 1932 – February 11, 1963
అమెరికను
.
Love is a Parallax.
.
‘Perspective betrays with its dichotomy:
train tracks always meet, not here, but only
in the impossible mind’s eye;
horizons beat a retreat as we embark
on sophist seas to overtake that mark
where wave pretends to drench real sky.’
.
‘Well then, if we agree, it is not odd
that one man’s devil is another’s god
or that the solar spectrum is
a multitude of shaded grays; suspense
on the quicksands of ambivalence
is our life’s whole nemesis.
.
So we could rave on, darling, you and I,
until the stars tick out a lullaby
about each cosmic pro and con;
nothing changes, for all the blazing of
our drastic jargon, but clock hands that move
implacably from twelve to one.
.
We raise our arguments like sitting ducks
to knock them down with logic or with luck
and contradict ourselves for fun;
the waitress holds our coats and we put on
the raw wind like a scarf; love is a faun
who insists his playmates run.
.
Now you, my intellectual leprechaun,
would have me swallow the entire sun
like an enormous oyster, down
the ocean in one gulp: you say a mark
of comet harakiri through the dark
should inflame the sleeping town.
.
So kiss: the drunks upon the curb and dames
in dubious doorways forget their Monday names,
caper with candles in their heads;
the leaves applaud, and Santa Claus flies in
scattering candy from a zeppelin,
playing his prodigal charades.
.
The moon leans down to took; the tilting fish
in the rare river wink and laugh; we lavish
blessings right and left and cry
hello, and then hello again in deaf
churchyard ears until the star lit stiff
graves all carol in reply.
.
Now kiss again: till our strict father leans
to call for curtain on our thousand scenes;
brazen actors mock at him,
multiply pink harlequins and sing
in gay ventriloquy from wing to wing
while foot lights flare and house lights dim.
.
Tell now, we taunt where black or white begins
and separate the flutes from violins:
the algebra of absolutes
explodes in a kaleidoscope of shapes
that jar, while each polemic jackanapes
joins his enemies’ recruits.
.
The paradox is that ‘the play’s the thing’:
though prima donna pouts and critic stings,
there burns throughout the line of words,
the cultivated act, a fierce brief fusion
which dreamers call real, and realists, illusion:
an insight like the flight of birds:
.
Arrows that lacerate the sky, while knowing
the secret of their ecstasy’s in going;
some day, moving, one will drop,
and, dropping, die, to trace a wound that heals
only to reopen as flesh congeals:
cycling phoenix never stops.
.
So we shall walk barefoot on walnut shells
of withered worlds, and stamp out puny hells
and heavens till the spirits squeak
surrender: to build our bed as high as jack’s
bold beanstalk;lie and love till sharp scythe hacks
away our rationed days and weeks.
.
Then jet the blue tent topple, stars rain down,
and god or void appall us till we drown
in our own tears:today we start
to pay the piper with each breath, yet love
knows not of death nor calculus above
the simple sum of heart plus heart.
.
Sylvia Plath.
Poem Courtesy: http://www.eliteskills.com/c/14985
Related articles
-
For Sylvia Plath’s 80th Birthday, Hear Her Read ‘A Birthday Present’ (openculture.com)
-
Quote of the day: Sylvia Plath (hotchocolateandbooks.wordpress.com)
-
Lady Lazarus ( Sylvia Plath ) (zendialogue.wordpress.com)
స్పందించండి