రోజు: నవంబర్ 22, 2016
-
ప్రేమ ఒక దృష్టిలోపం … సిల్వియా ప్లాత్, అమెరికను
చూసే దృష్టికోణం ద్వైదీభావనతో మోసగిస్తుంది: రైలుపట్టాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి, మరెక్కడోకాదు, అసంభవమైన మనోనేత్రంలో. సముద్ర తరంగాలు నింగిని కడుగుతున్నట్టు భ్రమింపజేసే క్షితిజరేఖను దాటిపోదామని మేధోసాగరాలమీద దిగంతరాలకు వెళుతున్న కొద్దీ, అవి వెనుకంజవేస్తూనే ఉంటాయి” ఇది నిజమని మనం అంగీకరిస్తే, ఒకరి దేముడు మరొకరికి దయ్యంగా కనిపించడం మనకి ఆశ్చర్యం కలిగించదు; లేదా, సప్తవర్ణాల సూర్య కాంతి, నీడలోని అనేకానేక వన్నెలుగా కనిపించవచ్చు; సందేహాల ఊబిలో చిక్కినపుడు, ఎటూ తేల్చుకోలేకపోడమే మనజీవితాలకి అధిగమించలేని పెద్ద అవరోధం .…