రోజు: నవంబర్ 21, 2016
-
సాగరసుమాలు… ఇ.జె.ప్రాట్, కెనేడియన్ కవి.
అవి విహరిస్తూ ఒక క్షణంలో చేసిన విన్యాసాన్ని వివరించడానికి భాషలో తగిన ఉపమానాలు లేవు… రజతము, స్ఫటికము, దంతము అన్నీ కళతప్పేయి. వినీలాకాశం మీద చెక్కినట్టున్న లిప్తపాటు కదలికలేని ఆ దృశ్యానికి సాటిలేదు, ఆ రెక్కల కదలిక, తేలి తేలి ఎగిరే తీరూ ముందు ఉష్ణమండలంలో నీలి నేపథ్యంలో తేలిపోయే చుక్కలూ పర్వతాగ్రాలమీద కురిసిన మంచూ దిగదుడుపే. సూర్యుడి ఏడురంగుల్ని పట్టుకున్న కొండకొమ్ముల్లోనో మధ్యలో ఎక్కడో లంకల్లో కనిపించిన పచ్చికమైదానాల్లోనో ఒకదాని వెనక ఒకటి ఇపుడు క్రిందకి…