రోజు: నవంబర్ 20, 2016
-
యుద్ధభూములమీదుగా తూరుపుగాలి … ఏలన్ డూగన్
రాత్రల్లా కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేసి వచ్చింది గాలి ఈ ఉదయం దగ్గరగా దువ్వుకున్న నీ జుత్తును చెదరగొడుతూ. అది దీర్ఘప్రయాణం చేసి, త్రోవమరచిన సముద్రపక్షుల్ని తనతో తీసుకొచ్చింది, పాడుతూ. ఎప్పటివో పురాతన గీతాలు పాత రణస్థలాలూ, శ్మశానాలనుండి, కొత్తచోట్లలో కొత్తగా వినిపిస్తూ. అవి కొత్తగా వినిపించడానికి వసంతం కారణం కావచ్చు, నీ కురులలో బద్ధకంతీర్చుకుంటున్న నిన్నటి తెమ్మెరలా. మనదికాని వాతావరణం ఏదైనా ఎంతో కొత్తగా కనిపిస్తుంది. దాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, గుండెనిండా పీల్చుకుంటూ, ఆ…