ఆడుతున్నవాళ్ళతో నేనెందుకు కలవాలి
వాళ్ళతో జతకలవడం నాకిష్టం లేదు.
వాళ్ళు తిట్లూశాపనార్థాలు పెడతారు, ఎన్నడూ ప్రార్థించరు
అన్ని రకాలపేర్లూ పెట్టి పిలుస్తారు, పోట్లాడుతారు.
నాకు ఆ పోకిరీ పాట వినడమంటే అసహ్యం
వాళ్ళ మాటలు నా చెవులకు కఠోరంగా వినిపిస్తాయి
వాళ్ళు మాటాడే భాష ఉపయోగించి
నేను నా నాలికని అపవిత్రం చేయ సాహసించను
ఆ మూర్ఖులనుండి నా దృష్టి తప్పిస్తాను
ఆ ఎగతాళి చేసే వాళ్ళతో కూడమన్నా కూడను.
నేను తెలివైన వాళ్ళతో అడుగులు కలుపుతాను
ఎప్పుడో ఒకప్పుడు నేనూ తెలివైనవాడిని కాకపోను.
ఎగతాళి చేసే ఒక సంస్కారహీనుడినుండి
పదిమంది ఆ అవహేళన విద్య నేర్చుకుంటారు.
ఒక రోగిష్టి గొర్రె మందంతటికీ రోగం సోకించి
అన్నిటినీ విషపూరితం చేసినట్టు.
.
ఐజాక్ వాట్స్
(17 July 1674 – 25 November 1748)
ఇంగ్లీషు కవి
.
.
Against Evil Company
Why should I join with those in Play,
In whom I’ve no delight,
Who curse and swear, but never pray,
Who call ill Names, and fight.
I hate to hear a wanton Song,
Their Words offend my Ears:
I should not dare defile my Tongue
With Language such as theirs.
Away from Fools I’ll turn my Eyes,
Nor with the Scoffers go;
I would be walking with the Wise,
That wiser I may grow.
స్పందించండి