రోజు: నవంబర్ 17, 2016
-
పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవి
కొందరు పక్కవాళ్ళది కొరికెస్తారు మోచెయ్యో, కాలో, ఏది దొరికితే అది. దానిని పళ్ళ మధ్య బిగబట్టి వీలయినంత వేగంగా పరిగెడతారు. దాన్ని మట్టిలో కప్పెస్తారు. అందరూ అన్ని దిక్కులా పరిగెడతారు వాసన చూడ్డం, వెతకడం, వాసనచూడ్డం, వెతకడం భూమినంతటినీ తవ్వెస్తారు. అదృష్టం బాగుంటే వాళ్లకో చెయ్యో లేదా కాలో, మరొకటో దొరుకుతుంది ఇప్పుడిక కొరకడం వాళ్ళ వంతు. ఈ ఆట మహా జోరుగా సాగుతుంది చేతులు దొరికినంత కాలం కాళ్ళు దొరికినంతకాలం అసలేదో ఒకటి…