కొన్ని కవితలు సునిశితమైన వ్యంగ్యంతో చెంప చెళ్ళుమనేలా కొట్టి నిజాన్ని తెలియజేస్తాయి. ఒక దేశపు శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక సంఘం ముఖపత్రం మీద ఆ దేశానికి చెందిన ఏ చిహ్నమూ కాకుండా మరొక దేశపు వ్యాపారసంస్థ పేరు ఉండడం హాస్యాస్పదమైన విషయం అనుకుంటే, పేరు మార్పులు తప్ప, మనదేశంలో చిత్రం ఇంతకంటే భిన్నంగా ఉందా అనిపిస్తుంది. దౌర్భాగ్యం కొద్దీ ఎప్పుడూ సమకాలీన అవసరాలదృష్టితోనే చారిత్రకపురుషుల విశ్లేషణ జరుగుతోంది తప్ప వాళ్ళు జాతికి చేసిన సేవనీ, అందించిన ఉత్కృష్టమైన వారసత్వపరంపర ఆధారంగా అంచనావెయ్యడంలో మనం ఎప్పుడూ వెనకబడే ఉన్నాం అంటే అతిశయోక్తి కాదేమో!
*
కెనడా శతాబ్ది సంఘం
Le Reine Elizabeth[1] హోటల్లో సమావేశమైంది
తమ గొప్పదనాన్ని తమకు తెలియజేస్తూ,
అపరిమితంగా ప్రతిస్పందనలు కలుగజేస్తూ
ప్రజలందరి హృదయాలలోనూ
కెనడా అనే ఒక దేశం నిజంగా ఉందని ఋజువుచేసే
జాతీయ చిహ్నాలు వెతకడానికి.
కార్యక్రమం ప్రారంభానికి ముందు
హాజరైన ప్రతి ప్రతినిధికీ
ఒక దస్త్రాన్ని అందించింది.
దాని ముఖ పత్రం మీద మెరుస్తున్న
బంగారు అక్షరాలతో కనిపిస్తున్నది
“సముద్రం నుండి సముద్రం వరకూ”[2]
అన్న కెనడా జాతీయ ధర్మసూత్రం కాదు;
“దైవదత్తమైన నా హక్కు”[3]
అన్న బ్రిటిషు రాజసూత్రం కాదు;
“నాకు గుర్తుంది”[4]
అన్న క్విబెక్ రాష్ట్ర ఆదర్శవాక్యమూ కాదు;
“అన్నిటిలోంచీ — ఒక్కటి”[5]
అన్న అమెరికా సంయుక్తరాష్ట్ర సంప్రదాయవాక్యమూ కాదు.
ఉన్నదల్లా
కోకోకోలా కంపెనీ సౌజన్యంతో… అని.
.
ఎఫ్. ఆర్. స్కాట్
August 1, 1899 – January 30, 1985
కెనేడియన్ కవి
.
National Identity
.
The Canadian Centenary Council
Meeting in Le Reine Elizabeth [1]
To seek those symbols
Which will explain ourselves to ourselves
Evoke unlimited responses
And prove that something called Canada
Really exists in the hearts of all
Handed out to every delegate
At the start of proceedings
A portfolio of documents
On the cover of which appeared
In gold letters not
A Mari Usque Ad Mare [2]
not
Dieu Et Mon Droit [3]
not
Je Me Souviens [4]
not
E Pluribus Unum [5]
but
COURTESY OF COCA-COLA LIMITED.
.
[Notes:
[1] Posh hotel in Montreal.
[2] ‘From sea to sea’. The official motto of Canada
[3] ‘God and my right’. Motto of the British Sovereign – on the British coat of arms
[4] ‘I remember’. Motto of Quebec; it’s even on their licence plates.
[5] ‘Out of many, One’. American motto. ]
.
F R Scott
August 1, 1899 – January 30, 1985
Canadian Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2001/05/national-identity-f-r-scott.html
స్పందించండి