వసంతం నా మీదకి తొంగి చూసి
గాఢనిద్రలో ఉండడం గమనించినపుడు
ఒక గుండె దాచలేక దాచిన రహస్యాన్ని
మట్టి ఇక దాచనక్కరలేదు.
వసంతం కోయిలలకి చెప్పినపుడు
మైదానాల్లోని పిట్టలకు తెలుస్తుంది
వీచే ప్రతి గాలికీ సున్నితంగా
ఆ మూడు మాటలనీ చెబుతాయి.
అతని ఇంటి చూరుమీద పిచ్చుకలు
దూరంగా చెదరగొట్టబడ్డ వర్షం
పోలిన ధ్వనులతో అతని కిటికీ
పక్కనున్న పిచ్చుకకి చెబుతాయి
ఓ పిచ్చుకా, నా చిన్ని పిచ్చుకా,
నేను దీర్ఘనిద్రలో ఉన్నపుడు
నే దాచలేక దాచిన రహస్యాన్ని
నా ప్రేమికకు చెబుతావు కదూ.
.
సారా టీజ్డేల్
అమెరికను కవయిత్రి

“I Love You”
When April bends above me
And finds me fast asleep,
Dust need not keep the secret
A live heart died to keep.
When April tells the thrushes,
The meadow-larks will know,
And pipe the three words lightly
To all the winds that blow.
Above his roof the swallows,
In notes like far-blown rain,
Will tell the little sparrow
Beside his window-pane.
O sparrow, little sparrow,
When I am fast asleep,
Then tell my love the secret
That I have died to keep.
.
Sara Teasdale
American
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…