పొగరుబోతు పొరపాటు… వాస్కో పోపా, సెర్బియను కవి

అనగనగా ఒకప్పుడు ఓ పొరపాటు ఉండేది
అది చాలా తెలివితక్కుదీ, చాలా చిన్నదీను.
దాన్ని ఎవరూ కనీసం గుర్తించేవారుకూడా కాదు.

అది తను తప్ప ఎవ్వరూ తనవంక చూడ్డంగాని
వినడంగాని చెయ్యకపోడాన్ని సహించలేకపోయింది.

అందుకని దానికి తోచిన అన్ని
విషయాలూ కనిపెట్టింది
దాని ఉనికి నిజంగా లేదని
ఋజువుచెయ్యడానికి.

అది దాని ఋజువులు భద్రపరచడానికి
రోదసిని సృష్టించింది.
అవి నిలవడానికి కాలాన్నీ,
ఆ ఋజువులు చూడ్డానికి ప్రపంచాన్నీ సృష్టించింది.

అది కల్పించినదంతా
తెలివితక్కువ విషయమూ కాదు.
అల్పవిషయమంతకన్నా కాదు.

అది పొరపాటువల్లే జరిగిందనుకొండి.

అయినా, మరోలా జరగడానికి అవకాశమేదీ?
.

(అనువాదం; ఏన్ పెనింగ్టన్)

.
వాస్కో పోపా
June 29, 1922 – January 5, 1991
సైబీరియన్ కవి.

.

A Conceited Mistake

.

Once upon a time there was a mistake

So silly so small

That no one would even have noticed it

It couldn’t bear

To see itself to hear of itself

….

….

(Trans. Anne Pennington)

Vasko Popa

June 29, 1922 – January 5, 1991

Serbian Poet of Romanian Origin.

.

For complete Poem visit:

http://www.poemhunter.com/poem/a-conceited-mistake/

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: